కీర్తి సురేష్.. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. అంతలా ఆ పాత్రలో జీవించేశారు కీర్తి. ఈ సినిమాలో హీరోయిన్ ఓరియెంటెడ్ కథలకు కీర్తి సురేష్ తగిన నటి అని నిరూపించుకున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఎలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది కీర్తిసురేష్. ఇక తాజాగా ఆమె రజిని 168వ చిత్రంలో అవకాశం దక్కించుకొని మరో బంపర్ ఆఫర్ అందుకున్నారు.
మరి మూవీలో ఆమె రూల్ ఏంటన్నది ఇంకా స్పష్టత లేదు. అయితే తాజాగా సమాచారం ప్రకారం.. కీర్తి సురేష్ ఈ చిత్రంలో రజిని చెల్లిగా నటిస్తారట. రజిని తల్లి తండ్రులకు లేటుగా పుట్టిన చెల్లిగా కీర్తి రోల్ ఉంటుందన్న వార్త ప్రచారం జరుగుతోంది. మరోవైపు రజిని డ్యూయల్ రోల్ చేస్తుండగా ఓ పాత్రకు హీరోయిన్ గా ఆమె నటిస్తున్నారంటూ మరో వాదన కూడా నడుస్తుంది. ఏదేమైనా సూపర్ ఫార్మ్ లో ఉన్న కీర్తి సురేష్ ఈ సినిమాలో రోల్ ఏంటో తెలియాలంటే మరికొన్ని ఆగాల్సిందే.
అయితే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ గురించి తమిళనాట ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రజినీ వయసు 68 సంవత్సరాలు. కీర్తి సురేష్ వయసు ఇరవయ్యారేళ్లు. రజినీ కూతుళ్లు కూడా కీర్తి కంటే దాదాపు పదేళ్లు పెద్దవాళ్లు. కీర్తి తల్లి అయిన హీరోయిన్ మేనకతో కూడా రజినీ నటించడం మరో విశేషం. కాగా, సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానున్నట్టు తెలుస్తోంది.