టాలీవుడ్ లో గతంలో హీరోల మధ్య పైకి కనపడని యుద్ధం ఒకటి ఎక్కువగా జరిగేది. హీరోల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని అప్పట్లో పత్రికలూ కూడా ఎక్కువగా వార్తలు రాసేవి. అందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు గాని… ఒక హీరో కార్యక్రమానికి మరో హీరో అసలు వెళ్ళే వారు కాదు. అయితే కొన్నేళ్ళు గా ఈ పరిస్థితి పూర్తిగా మారింది. ఒక హీరో కార్యక్రమానికి మరో హీరో వెళ్ళడం జరుగుతుంది. మెగా ఫ్యామిలీ అయితే ఈ విధానానికి ముందు ఉంది. యువ హీరోల కార్యక్రమాలకు మెగా కుటుంబం హాజరు అవుతుంది.
రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వారు ఇతర హీరోల సినిమాలకు హాజరవుతున్నారు. తాజాగా ఎప్పుడు లేని విధంగా చిరంజీవి మహేష్ బాబు సినిమా కార్యక్రమానికి హాజరు కానున్నారు. గతంలో దుబాయ్‌లో జరిగిన మహేశ్ ‘నిజం’ ఆడియో ఫంక్షన్‌కు చిరంజీవి అతిథిగా హాజరయ్యారు. జనవరి 5న ఎల్‌బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు కార్యక్రమం జరుగుతుంది. దీనికి చిరు హాజరు కావడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఇటు అభిమానులు కూడా భారీగానే చర్చించుకుంటున్నారు.
భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ బాబు ఫాలోయింగ్ భారీగా పెరిగింది. మహర్షితో ఎక్కడికో వెళ్లాడు.
ఆయన వంద కోట్ల హీరో అయ్యారు. ఇతర భాషల్లో కూడా మహేష్ బాబు సినిమాలు పరవాలేదనిపిస్తున్నాయి. దీనితో మహేష్ అభిమానులను తనకు దగ్గర చేసుకోవడానికే చిరంజీవి మొదటి సారి హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నారని అంటున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా విడుదల అవుతున్నాయి. వాటికి వసూళ్లను పెంచడానికి గాను ఆయన ఈ కార్యక్రమానికి వెళ్తున్నారని అంటున్నారు.