ఎప్పుడు నవ్వుతూ ఉండే కవిత లైఫ్‌లో ఇన్ని బాధ‌లా.. ఆత్మ‌హ‌త్య చేసుకుని చావాల‌నుకుందా…!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక వెలుగు వెలిగింది కవిత. ఆమె పల్లెటూరి నుంచి వచ్చినా సినిమాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. కవిత తెలుగులోనే కాక కన్న‌డ, మలయాళ భాషల్లోనూ 130 సినిమాలకు పైగా నటించింది. ఆమె తన 11 ఏళ్ళ వయసులోనే ఓ మంజు అనే మూవీతో తమిళ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిమంచి గుర్తింపు తెచ్చుకోవ‌డంతో వరుస సినిమాల్లో దూసుకుపోయింది కవిత. తెలుగులో సిరిసిరిమువ్వ అనే మూవీలో జయప్రదకు చెల్లెలుగా నటించింది. త‌ర్వాత ఎన్నో హిట్ సినిమాల‌లో న‌టించింది కవిత.

కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైం లోనే ఒక కోటీశ్వరుని చూసి వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉన్న కవిత తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ ఎంట్రీ ఇచ్చి కెరియర్ కొనసాగించింది. ప్రస్తుతం ఎలాంటి సినిమా ఆఫర్లు లేక ఖాళీగా ఉన్న కవిత మళ్లీ నటించే అవకాశం కోసం ఎదురుచూస్తుంది. అయితే ఇటీవల కరోనా మహమ్మారి వల్ల ఆమె చాలా నష్టపోయింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కవిత తన జీవితంలో జరిగిన కొన్ని బాధాకర విషయాలను చెబుతూ ఎమోషనల్ అయింది. తాను చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నానని.. పెళ్లయ్యాక కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అప్పటి వరకు ఒప్పుకున్న ప్రాజెక్టులకు మాత్రమే నటించి వెండితెరకు దూరమైనా కొనేళ్ల తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చానని చెప్పింది.

Kavitha's Husband Death: 2 Weeks after Son's Death, Actress Dies Due to Covid-19 - IBTimes India

తన భర్తకు కోట్ల ఆస్తి ఉన్న విషయం నిజమే.. ఒకప్పుడు 11 దేశాల్లో ఆయిల్ బిజినెస్‌లు ఉండేవి.. నన్ను ఒక మహారాణిలా చూసుకుంటూ… నా అభిప్రాయాని చాలా గౌరవించే వారు. కానీ ఏడేళ్ల క్రితం మా బిజినెస్ లు అన్నిట్లో నష్టం రావడంతో దాదాపు రు. 132 కోట్లకు పైగా ఆస్తిని పోగొట్టుకున్నామని… దాని కారణంగానే కొన్ని ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పింది. ఆ టైంలో తాను చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది.

Kavitha Photos, Videos, Birthday, Latest News, Height In Feet - FilmiBeat

దాంతో డిప్రెషన్ కి గురి అయిన తన భర్త 11 రోజులపాటు కోమాలో ఉన్నాడని ఆ వెంటనే కరోనా మహమ్మారి చుట్టుముట్టడంతో భ‌ర్త‌, కొడుకు ఇద్ద‌రూ చ‌నిపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. మొదట కరోనా వచ్చి తన కొడుకు చనిపోయాడని.. ఆ తర్వాత పది రోజులకే తన భర్త చనిపోయారని ఇద్ద‌రు ఒకేసారి చనిపోవడంతో ఆ బాధ తట్టుకోలేక ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని.. కానీ నా కూతుర్లను చూసి ఆ ఆలోచనలు విరమించుకున్నానని చెప్పుకొచ్చింది కవిత.