టీడీపీతో పొత్తు ఫిక్స్‌.. ఆ 7 సీట్లు జ‌న‌సేన ఖాతాలోకే…!

తెలుగుదేశం – జనసేన మధ్య వచ్చే ఎన్నికలలో పొత్తు దాదాపు ఖరారు అయినట్టే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చేశారు. పార్టీని బతికించుకోవాలంటే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళక తప్పదన్న విషయాన్ని ఆయన పార్టీ కేడర్ కు కూడా చెప్పకనే చెప్పేశారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే జనసేన ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుంది.. చంద్రబాబు ఆ పార్టీకి ఎన్ని సీట్లు ?ఇస్తారు అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా ఉంది.

Telugu Desam Party accuses Telangana Rashtra Samithi of using strong-arm tactics to force partymen to join YSRCP - The Economic Times

అలాగే ఏ ఏ జిల్లాలో ఏయే సీట్ల నుంచి జనసేన పోటీ చేస్తుంది అన్నది కూడా చర్చ‌నీయాంశంగా మారింది. ఇప్పటికే పొత్తు కుదిరితే జనసేన ఏయే సీట్లలో పోటీ చేయాలన్న దానిపై ఆ పార్టీ కీలకనేత నాదెండ్ల‌ మనోహర్ కూడా కొన్ని సీట్ల పేర్లను తెలుగుదేశం పార్టీ వద్ద ప్రతిపాదనకు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ‌ వర్గాల సమాచారం ప్రకారం జనసేనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే సీట్ల సంఖ్య 25 కు అటు ఇటుగా ఉంటుందని చెబుతున్నారు.

అయితే గత ఎన్నికలలో జనసేన చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధించిన ఏడు నియోజకవర్గాలను కచ్చితంగా ఆ పార్టీకే కేటాయిస్తారట. గత ఎన్నికలలో జనసేనకు 7 నియోజకవర్గాలలో 40 వేలకు మించిన ఓట్లు వచ్చాయి. అందులో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక – భీమవరం రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే మరో ఐదు నియోజకవర్గాలలో కూడా జనసేనకు 40 వేలకు మించిన ఓట్లు దక్కాయి.

File:Janasena Party Flag.png - Wikimedia Commons

ఇందులో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కూడా ఒక‌టి. ఇక జనసేనకు టిడిపి కేటాయించే సీట్లలో ఈ ఏడు సీట్లు కచ్చితంగా ఉండనున్నాయి. అలాగే ఓవరాల్ గా 25కు త‌గ్గ‌కుండా అసెంబ్లీ సీట్ల‌తో పాటు ఐదు లోక్‌స‌భ సీట్లు కూడా జ‌న‌సేన‌కు ఇస్తార‌ని అంటున్నారు.