స్టార్ హీరోతో కత్రినా కైఫ్ సీరియస్ డిస్కషన్…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మెర్రీ క్రిస్మస్ సినిమాలో కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. అంధాధున్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.

కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ లో సినిమాకు సంబంధించిన కొన్ని చిత్రాలను షేర్ చేసింది . కత్రినా ఈ చిత్రం యొక్క రిహార్సల్స్ చిత్రాలను పోస్ట్ చేసింది. ఫోటోలో కత్రినా, విజయ్ సేతుపతి మరియు శ్రీరామ్ రాఘవన్‌లను సినిమాకి సంభందించి చర్చల్లో కనిపిస్తున్నారు.

మెర్రీ క్రిస్మస్‌ను టిప్స్ ఇండస్ట్రీస్ మ్యాచ్‌బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి చేస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 23, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో ప్రకటించబడతాయి.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

Tags: director sriram raghavan, Katrina Kaif, merry christmas movie, Vijay Sethupathi