అలియా భట్ ‘డార్లింగ్స్ ” ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై అరంగేట్రం కోసం సిద్ధంగా ఉండటంతో పటు అలియా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ అయిన డార్లింగ్స్‌తో నిర్మాతగా మారింది . రీసెంట్గా అలియా నటించిన “డార్లింగ్స్ “ట్రైలర్ విడుదలైంది .ట్రైలర్ బట్టి చూస్తే హాస్యం కాస్త ఎక్కువగా కనబడుతుంది. ట్రైలర్‌లో హమ్జా షేక్ (విజయ్ వర్మ) తన ఇంటిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అతని భార్య బద్రునిస్సా (ఆలియా భట్) మరియు ఆమె తల్లి (షెఫాలీ షా) బద్రు తప్పిపోయిన భర్తపై ఫిర్యాదు చేశారు. మిగిలిన డార్లింగ్స్ అంతా హంజా షేక్ మరియు బద్రునిస్సా కథకు సంబంధించినది. ట్రైలర్‌లో పవర్‌ఫుల్ రివెంజ్ డ్రామా గా కనిపిస్తుంది . బద్రునిస్సా తన భర్తను దాచిపెట్టి అతనికి గుణపాఠం చెబుతుంది.

ఆలియా భట్ ఈ పాత్రలో ఉల్లాసంగా,నిజాతిగా కనిపించింది. షెఫాలీ షా మరియు విజయ్ వర్మ వారి కేరక్టర్స్ లలో బాగానే నటించారు . డార్లింగ్స్ తక్కువ బడ్జెట్‌తో నిర్మించబడింది మరియు ఈ చిత్రం ఆగస్టు 5 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. జస్మీత్ కె రీన్ దర్శకుడు. షారూఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆలియాస్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా డార్లింగ్స్ నిర్మించింది.

Tags: Alia Bhatt, Darlings Official Trailer, Netflix India, Roshan Mathew, Shefali Shah, Vijay Varma