హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన సినిమా ‘కార్తికేయ2’. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. నిఖిల్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. పాజిటివ్ మౌత్ టాక్ వల్ల సినిమాకు విపరీతమైన లాభాలు వస్తున్నాయి. తెలుగు, హిందీ సహా యూఎస్ లోనూ మంచి వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది.
చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘కార్తికేయ2’.. అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తుంది. తాజాగా ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద మరో రికార్డు క్రియేట్ చేసిది. సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు దాటినా కలెక్షన్లు ఏమాత్రం తగ్గడం లేదు. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మొదటి రెండు వారాల్లో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధిస్తున్న సినిమాగా ‘కార్తికేయ2’ నిలిచింది. యూఎస్ లో 1.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి 2 మిలియన్ డాలర్ల వైపు పరుగులు తీస్తోంది.. తెలుగులో ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ ఫీట్ అందుకున్న రెండో సినిమాగా కార్తికేయ2 నిలిచింది..
‘కార్తికేయ 2’ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.18 కోట్ల వరకు షేర్ రాబట్టాలి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసింది.. 19 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.52.30 కోట్ల షేర్(రూ.105.05 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు ఇప్పటివరకు రూ.40 కోట్లు లాభం వచ్చింది.
ఈ సినిమాలో నిఖిల్ తో పాటు అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. 2014లో విడుదలైన ‘కార్తికేయ’ సినిమాకు ఇది సీక్వెల్.. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ శ్రీకృష్ణుడు తత్త్వం గురించి చెప్పే డైలాగ్ ప్రేక్షకులను గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.. ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తోంది.. సూపర్బ్ రెస్పాన్స్ తో మంచి వసూళ్లు సాధిస్తోంది.