Megastar : ఆచార్య ఫెయిల్యూర్.. ఇంతకీ చిరంజీవి ఎవరిది తప్పంటున్నారు..?

ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్లాలంటే చాలా టెస్ట్ లు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ముందు రైటర్ డైరక్టర్ కథ రాసుకున్నప్పుడు అది తనకు నచ్చి హీరోని కన్విన్స్ చేసేలా నరేట్ చేయడం. అది హీరోకి నచ్చితే ఫుల్ వర్షన్ వినిపించడం. ఇక ఆ హీరోగారికి కావాల్సిన కమర్షియల్ హంగులను సినిమాలో చేర్చడం. కథ అనుకున్నప్పుడు లేని కొన్ని అనవసరమైన సీన్లు, ఎలివేషన్లు, స్పెషల్ సాంగ్స్ బౌండెడ్ స్క్రిప్ట్ లో వచ్చి చేరుతాయి.

అయితే హీరో మీద ఉన్న నమ్మకంతో అలానే తీస్తారు. సినిమా రిజల్ట్ చూస్తే డిజాస్టర్. ఇప్పుడు ఈ సినిమా ఫెయిల్యూర్కి కారణం ఎవరని నిందించాలి. కథగా రాసుకున్నప్పుడు నచ్చిన సినిమా రిలీజ్ అయ్యాక నచ్చలేదు. అంటే మధ్యలో జరిగిన మార్పుల వల్లే సినిమా ఫలితం తేడా కొట్టేసింది. పోనీ దర్శకుడు అనుభవం లేని వాడ అంటే అది కాదు.. రైటర్ గా హిట్లు కొట్టి దర్శకుడిగా ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సినిమాలు చేస్తూ వచ్చాడు.

ఇక్కడ ప్రస్థావించిన సినిమా ఏంటన్నది ఇప్పటికే మీకు అర్ధమై ఉండొచ్చు. Megastar చిరంజీవి నటించిన ఆచార్య సినిమా గురించే.. మైక్ పట్టుకునే ఈమధ్య చిరు ఆచార్య ఫ్లాప్ గురించి చెబుతున్నారు. ఆచార్య ఫ్లాప్ బాధ్యత కేవలం దర్శకుడు కొరటాల శివ మీదనే కాదు హీరోలుగా నటించిన చిరంజీవి, రాం చరణ్ ల మీద ఉంటుంది. కేవలం దర్శకుడి తప్పిదం వల్లే అయితే ఇదివరకు అతను సినిమాలు ఎన్ని సూపర్ హిట్లు అయ్యాయి. కాబట్టి ప్రతిసారి ఆచార్యని తలచుకుని దర్శకుడిని నిందించకుండా అందులో తమ తప్పు కూడా ఉందని గుర్తిస్తే బెటర్ ని సగటు సినీ ప్రేక్షకుడు అంటున్నారు.

Tags: Acharya, Acharya Failure, chiranjeevi, FDFS Event, koratala siva, Megastar Chiranjeevi