నిఖిల్ కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్.. నాలుగు రోజుల్లో సాధించిందెంతంటే..!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ లోని ఇతర భాషల్లో, నార్త్, ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఈ సినిమా నార్త్ లో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. మొదటిరోజు అక్కడ 53షోల తో మొదలైన ఈ సినిమా.. సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రస్తుతం అక్కడ రోజుకు 2500 నుంచి 3000 షోలు వేసే రేంజ్ కి చేరుకుంది.

కలెక్షన్స్ కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. నార్త్ మొత్తం హౌస్ ఫుల్ బోర్డ్ లతో ఈ సినిమా నడుస్తోంది. ఈ సినిమాతో పాటు హిందీలో విడుదలైన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ డిజాస్టర్ కావడంతో కార్తికేయ2ని అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

ఈ సినిమా నాలుగు రోజుల్లో 35.1 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ఈ మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. చాలా రోజుల తర్వాత నిఖిల్ కెరీర్ లో మరొక బ్లాక్ బస్టర్ నమోదయింది. నాలుగు రోజుల్లో 35కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం నిఖిల్ కెరీర్లో ఇదే తొలిసారి. కార్తికేయ2 సినిమా హిందీలో కూడా విజయం సాధించడంతో ప్రస్తుతం చిత్ర యూనిట్ అక్కడ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.

Tags: Anupama Parameswaran, karthikeya 2 movie collections, Nikhil, tollywood news