బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో స్టార్ సెలబ్రిటీస్ కంటెస్టంట్స్ గా వస్తున్నట్టు తెలుస్తుంది. సీజన్ 6లో టాప్ సెలబ్రిటీస్ వస్తున్నారని టాక్. వారిలో ఒకరు ప్రముఖ సింగర్ మోహన భోగరాజు కూడా సీజన్ 6లో పాల్గొంటున్నారని తెలుస్తుంది.
బిగ్ బాస్ (BiggBoss) సీజన్ 6 లో మోహన భోగరాజు స్పెషల్ క్రేజ్ తెచ్చుకోనుంది. సింగర్ గా తన వాయిస్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న మోహన భోగరాజు ఈసారి బిగ్ బాస్ లో తన సత్తా చాటాలని చూస్తుంది. సింగర్ గా సూపర్ బిజీగా ఉన్న మోహన భోగరాజు బిగ్ బాస్ లో పాల్గొనేందుకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. హౌజ్ లో ఒక సింగర్ ఉంటే బాగుంటుందని బిగ్ బాస్ టీం ఆమె అడిగినంత ఇస్తున్నారట. సినిమా పాటలే కాదు ప్రైవేట్ సాంగ్స్ లో కూడా తన సత్తా చాటింది మోహన భోగరాజు. అందరు మెచ్చిన బుల్లెట్ బండెక్కి వస్తవాబా సాంగ్ ఆమె పాడిందే.
ఇప్పటికే సీజన్ 6 కోసం కంటెస్టంట్స్ అంతా కూడా క్వారెంటైన్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్ కోసం బిగ్ బాస్ (BiggBoss) లవర్స్ అంతా చాలా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.