ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 కోసం సిద్ధమవుతున్న అల్లు అర్జున్ మరోపక్క సోషల్ మీడియాలో తన స్టైలిష్ లుక్స్ తో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో Pushpa Raj అల్లు అర్జున్ మరో మైల్ స్టోన్ ని పూర్తి చేసుకున్నాడు. ఇన్ స్టాగ్రాం లో 19 మిలియన్లకు దగ్గగరా ఉన్న బన్నీ లేటెస్ట్ గా ట్విట్టర్ లో 7 మిలియన్ ఫాలోవర్స్ ని క్రాస్ చేశాడు.
పుష్ప రాజ్ హవా సోషల్ మీడియాలో కూడా కొనసాగుతుంది. ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క వాణిజ్య ప్రకటనలలో కూడా సత్తా చాటుతున్నాడు Pushpa Raj అల్లు అర్జున్. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ హోం వర్క్ చేస్తున్నారు. పుష్ప 2 కోసం బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
సుకుమార్, అల్లు అర్జున్ మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద తమ మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. 2023 సెకండ్ హాఫ్ లో పుష్ప 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.