ఎన్ని సినిమాలు.. ఎన్ని వందల కోట్ల సినిమాలు వచ్చినా సగటు గృహిణికి మాత్రం సాయంత్రం సీరియల్స్ చూడనిది నిద్ర పట్టదు. ఫలనా టైం కి ఫలానా సీరియల్ అని వారు టైం ఫిక్స్ చేసుకుని మరి సీరియల్ టైం కి అన్ని పనులను సెట్ రైట్ చేసుకుంటారు. ఇక బుల్లితెర మీద సూపర్ హిట్ సీరియల్స్ చాలా ఉన్నాయి. ప్రస్తుతం స్టార్ మా లో సూపర్ హిట్ సీరియల్ అంటే అందరు చెప్పే పేరు ఒక్కటే అదే కార్తీక దీపం (Karthika Deepam ). ఈ సీరియల్ లో డాక్టర్ బాబుగా నిరుపం.. దీప పాత్రలో ప్రేమి విశ్వనాథ్ నటిస్తున్నారు.
కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సీరియల్ అంటే బుల్లితెర ఆడియెన్స్ కి పిచ్చి అని చెప్పొచ్చు. అయితే కొన్నాళ్లుగా కార్తీక దీపంలో దీప కనిపించకపోయేఏ సరికి ఆ సీరియల్ టీ.ఆర్.పి తగ్గింది. ఆమె పాత్ర ముగిసిందన్నట్టు చూపించగా ఇప్పుడు ఆమె పాత్ర రీ ఎంట్రీ ఇప్పించారు. కార్తీక దీపం (Karthika Deepam )లో దీప మళ్లీ వస్తుందని స్టార్ మా హంగామా మొదలు పెట్టింది. ఈ సీరియల్ కోసం స్పెషల్ గా పోస్టర్ యాడ్స్ కూడా వేస్తున్నారు.
కార్తీక దీపం సీరియల్ లో దీప రీ ఎంట్రీకి ఇంత హంగామా అవసరమా అంటూ కొందరు వాపోతున్నారు. సీరియల్ టి.ఆర్.పి రేటింగ్ పెంచేందుకు స్టార్ మా చేస్తున్న హడావిడే తప్ప సీరియల్ అప్పట్లో ఉన్నంత గ్రిప్పింగ్ గా లేదని కొందరి ఆడియెన్స్ టాక్.