ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) అనుకోకుండా మెడికల్ మాఫియా గుట్టు రట్టు చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. అదేంటి అంటే అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో అని తెలుస్తుంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల మీద దృష్టి పెడుతున్నాడు. పరశురాం డైరక్షన్ లో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని టాక్. అయితే ఈ సినిమా మెడికల్ మాఫియా కు సంబందించిన కథగా వస్తుందని తెలుస్తుంది.
సర్కారు వారి పాట సినిమాతో హిట్ అందుకున్న పరశురాం అల్లు అర్జున్ (Allu Arjun ) కోసం మెడికల్ మాఫియాతో కూడిన కథని సిద్ధం చేశాడట. కథ నచ్చిన బన్నీ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. అయితే పరశురాం సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు.
పుష్ప సినిమాతో నేషనల్ లెవల్ లో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాలతో కూడా అదే రేంజ్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 కూడా భారీ అంచనాలతో రాబోతుంది. ఈ సినిమా కూడా అక్కడ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు.