Jabardasth : జబర్దస్త్ కొత్త జడ్జ్.. స్కిట్ మధ్యలో ఈయన లొల్లి ఎక్కువైంది..!

జబర్దస్త్ లో ఇంకా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. స్టార్ జడ్జ్ రోజా కూడా ఎగ్జిట్ అయ్యాక ఆమె ప్లేస్ లో ఇంద్రజ వచ్చి చేరారు. దాదాపు ఆమె జబర్దస్త్ (Jabardasth) లో ఫిక్స్ అయినట్టే అని చెప్పుకోవచ్చు. ఇక మరోపక్క మొన్నటిదాకా మనో గారు కూడా పర్మినెంట్ జడ్జ్ అనుకున్నారు కానీ ఆయన స్టార్ మాకి షిఫ్ట్ అవడంతో ఇప్పుడు ఆ ఖుర్చీ ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో వారానికి ఒక స్పెష గెస్ట్ తో ఎలాగోలా మ్యానేజ్ చేయగా ఫైనల్ గా ఒకప్పటి స్టార్ కమెడియన్ కృష్ణ భగవాన్ ని తీసుకొచ్చి జడ్జ్ చెయిర్ లో ఉంచారు.

దాదాపు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా ఏళ్లుగా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ బఘవాన్ జబర్దస్త్ (Jabardasth) జడ్జ్ గా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఆయన పంచులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే జబర్దస్త్ జడ్జ్ గా కూడా ఆయన కమెడియన్స్ చేస్తున్న స్కిట్స్ లో ఇన్వాల్వ్ అవుతూ పంచులు వేస్తున్నారు. ఇది ఓరకంగా మంచిదే అయినా కొన్నిసార్లు స్కిట్ కి దెబ్బ పడుతుంది.

ఈ ఒక్క విషయం సెట్ రైట్ చేసుకుంటే జబర్దస్త్ షోకి కృష్ణ భగవాన్ పర్ఫెక్ట్ అని అంటున్నారు. అయితే స్కిట్ మధ్యలో ఆయన దూరితే మాత్రం మధ్యలో నీ లొల్లి ఏంటయ్యా అని ఆడియెన్స్ ఫీల్ అవడం గ్యారెంటీ.

Tags: ETV, Jabardast New Judge, Jabardasth, Jabardasth Show, Krishna Bhagavan, Star Comedian, Tollywood