2019 ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయి కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది. గెలిచిన ఈ 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళ్లినా కూడా చంద్రబాబు మానసిక స్థైర్యాన్ని ఎంత మాత్రం కోల్పోలేదు. ఎవరు ఉన్నా ఎవరు పోయినా కూడా పార్టీ కోసం ప్రజలు ఉన్నారనే నమ్మకంతో ఆయన ఓడిపోయినప్పటి నుంచి పోరాటం మొదలు పెట్టారు.
కరోనా వచ్చినప్పుడు యేడాదిన్నర టైంలో కూడా జూమ్ మీటింగ్‌ల ద్వారా పార్టీ కేడర్‌ను, కార్యకర్తలను కలుసుకుంటూ వారికి మరింత చేరువ అయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష యుద్ధంలోకి దిగిపోయారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చంద్రబాబు నిరంతరం యుద్ధం చేస్తూనే వస్తున్నారు.
గతంలో వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు.. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు ఈ రేంజ్‌లో బయటకు రాలేదు. అయితే గతంలో ఉన్న చంద్రబాబు వేరు.. ఇప్పటి చంద్రబాబు వేరు అన్నట్టుగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఇక ఎన్నికలకు మరో 9 నెలల టైం ఉండడంతో చంద్రబాబు మరింత దూకుడు పెంచారు.
ఈ నెల 16 నుంచి ఆయన పూర్తిగా ఏపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఈ నెల 16 నుంచి మరో లెక్క అన్నట్టుగా చంద్రబాబు దూకుడు ఉండబోతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్ని నియోజకవర్గాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడంతో పాటు ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయడంతో పాటు లోపాలను ఎప్పటికప్పుడు వాళ్లకు తెలియజేస్తూ పార్టీని దూకుడుతో ముందుకు నడిపించ బోతున్నట్టు పార్టీ శ్రేణులే చెపుతున్నాయి. మరి చంద్రబాబు ఈ నయా దూకుడు పార్టీని ముందుకు ఎలా ? నడిపించబోతోందో చూడాలి.