చాలా మంది అందంగా ఆకర్షణీయంగా కనిపించటానికి ప్రయత్నిస్తుంటారు. మరియు కొద్దిగా వయసు మళ్ళిన వారు సహించలేరు, యవ్వనంగా కనపడటానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.
1.చర్మానికి తేమని సమకూర్చండి
చర్మానికి తగిన స్థాయిలో తేమని సమకూర్చటం వలన యవ్వనంగా కనపడేలా చేస్తుంది. ఇది చర్మం పైన ఉండే కలంకాలను తోలగించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ చర్మం ఎక్కువ ఆయిల్’ని కలిగి ఉన్నట్లయితే, ఆయిల్’ని తోలగించి తేమని అందించే వాటిని వాడండి. మీరు వాడే ఉత్పత్తులు తేమని కలిగించి, ఇబ్బందులకు గురి చేస్తున్నాయా? …అయితే మీరు వేరే ఉత్పత్తులను వాడి చూడండి.
2.మూఖానికి మేకప్
చర్మానికి ఎక్కువ పౌడర్’లను పూయటం అంత మంచిది కాదు, వీటి వలన చర్మ కణాల మద్య ఉండే గీతల మధ్యలో పౌడర్ ఇరుక్కుపోతుంది. మీ చర్మం మృదువుగా కనపడాలి అనుకుంటే వీటిని వాడకూడదు. చర్మం నుండి పౌడర్ మరియు దుమ్ము, ధూళిలను వేరు చేయటానికి కాటన్ లేదా పత్తిని వాడటం చాలా మంచిది.
3.సూర్యకాంతికి దూరంగా ఉండండి
నడిచేటపుడు సూర్య కాంతికి దూరంగా ఉండండి, దీని వలన చర్మ కణాలు దెబ్బతినడం, కాన్సర్ రావటం, లేదా చర్మం పైన ముడతలు వచ్చే అవకాశం ఉంది. కావున వీలైనంతగా సూర్యరశ్మికి దూరంగా ఉండండి. సూర్య కాంతిలో వెళ్ళటానికి ముందుగా, సూర్య రశ్మికి బహిర్గతమయ్యే ప్రదేశాలలో సన్ స్క్రీన్ లేదా గోడుగుని వాడండి.
4.ఎక్కువ నీరు
శరీరంలో అన్ని అవయవాలు, వాటి విధులను నిర్వర్తించటానికి నీరు తప్పక అవసరం. శరీరంలో నీటి స్థాయిలు తగ్గినట్లయితే అవయవాల నిధులు నిలిపి వేయబడతాయి. 10 గ్లాసుల నీటిని తాగటం వలన చర్మం ఉపరితలం పైన ఉండే నిర్జీవ కణాలు, ఆరోగ్య వంతమైన కణాలతో మార్చబడి మీరు యవ్వనంగా కనబడతారు.
5.కంటి క్రీమ్
వృద్దాప్యం వచ్చిందా, అని చూసేపుడు ముందుగా కంటి కింద మరియు కంటి చుట్టూ ఉన్న చర్మాన్ని పరిక్షించి చూడాలి. ఈ భాగంలో వృద్దాప్యంపై బడే లక్షణాలు ప్రారంభమవుతాయి. మీరు యవ్వనంగా కనపడటానికి ఈ ప్రాంతంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
6.జుట్టుని ఆరోగ్యకరంగా ఉంచుకోండి
యవ్వనంగా ఉన్న, బలహీనంగా లేదా అనారోగ్యంగా ఉన్నా, మీరు వయసులో పెద్ద వారిలా కనిపిస్తారు. జుట్టు తెల్లబడిన వెంటనే కలర్ లేదా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫేస్-ఫ్రెమింగ్ చేపించటం వలన కొన్ని సంవత్సరాల వారకి యవ్వనంగా కనబడతారు. ఆరోగ్యకరమైన ఆహరం తినండి మరియు రోజు రాత్రి పడుకోటానికి ముందుగా తలని, జుట్టును నూనెలతో మసాజ్ చేయండి.
7.జుట్టు కోసం
రెండు చెంచాల అవిసె విత్తనాలను మరియు రెండు కప్పుల నీటిని కలిపి 15 నిమిషాల పాటు వేడి చేయండి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి, మీకు నచ్చిన ఎస్సేన్షియాల్ ఆయిల్’ని కలపండి. ఈ మిశ్రమాన్ని శుభ్రపరచిన బాటిలో తీసుకొని అది మందపాటి లేదా చిక్కటి మిశ్రమం అయ్యే వరకు అలానే ఉంచండి. మీ జుట్టుకి ఈ మిశ్రమాన్ని వాడి తరువాత జరిగే మార్పులను గమనించండి.
8.మీ దంతాలను తెల్లగా ఉంచుకోండి
ముత్యాల లాంటి దంతాలు మిమ్మల్ని ఆరోగ్యవంతంగా మరియు యవ్వనంగా కనపడేలా చేస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి మరియు యవ్వనంగా కనపడటానికి, దంతాలు తెల్లగా ఉండాలి తెల్లటి పళ్ళని లేకపోతే దంత వైద్యుడిని సంప్రదించండి. దంతాలు ఎక్కువ తెల్లగా ఉండేలా మార్చమని దంత వైద్యుడికి చెప్పండి.