గుప్పెడంత మ‌న‌సు: వసుధార యాటిట్యూడ్ చూశారా… ఏంజెల్ గురించి విశ్వనాథం టెన్ష‌న్‌..!

గుప్పెడంత మనసు సీరియల్ విశ్వనాథంకి హార్ట్ ఎటాక్ వస్తుంది. ఏంజెల్ అతడి విషయంలో కంగారు పడుతూ ఉంటుంది. హాస్పటల్‌కి తీసుకెళ్లిన తర్వాత విశ్వనాథం ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. ఏంజెల్ హాస్పిటల్ బయట ఏడుస్తూ ఉంటుంది. చిన్నపిల్లల ఏడవకు విశ్వంకి ఏం కాదు ? ప్రస్తుతం బానే ఉంది అంటూ రిషి ధైర్యం చెప్తాడు. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఏమైందంటే రిషి.. ఏంజెల్ దగ్గరకు వచ్చి నన్ను కాలేజీకి వెళ్ళమంటావా లేకపోతే లీవ్ పెట్టి ఉండమంటావా ? అని అడుగుతాడు. విశ్వానికి బాగానే ఉంది కదా కావాలంటే నేను కాల్ చేస్తాను.. ఇప్పుడు కాలేజ్‌కి వెళ్ళు రిషి అని చెప్తుంది. రిషి కాలేజ్ కి బయలుదేరుతాడు.

మరోవైపు టైం అయినా రిషి కాలేజీకి రాకపోవడంతో వసు మళ్ళీ రిషికేమైనా ఏందేమోనని కంగారు పడుతూ ఉంటుంది. కొంతసేపటికి వసు క్లాస్ బయటకి వస్తుంటే రిషి కనిపిస్తాడు. రిషి.. వసుని చూసి విశ్వనాథం సంగతి చెబుదామనుకుంటాడు. కానీ ఈగో అడ్డొచ్చి ఆగిపోతాడు. ఇంతలో ఏంజెల్ వ‌సుకి ఫోన్ చేసి విశ్వానికి బాగోలేదు అని చెప్తుంది. కంగారుపడిన వసు నేను వస్తాను అంటుంది. వద్దు క్లాసులు మానేసి వస్తే విశ్వానికి, రిషికి ఇద్దరికీ కోపం వస్తుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత రిషి ఇంటికి వస్తాడు కదా అప్పుడు తనతో పాటు నువ్వు కూడా రా అని చెప్తుంది.

వ‌సు తండ్రికి ఫోన్ చేసి విషయాన్ని వివరిస్తుంది. విశ్వనాథం గారి ఇంటికి సాయంత్రం వెళ్తాను అని చెప్పి పెట్టేసింది. మరోవైపు ఏంజెల్ రిషికి ఫోన్ చేసి వ‌సుని తీసుకురా ? అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. కాలేజ్ అయిపోయి వసు బయటికి నడుస్తుంటే పక్కన కారు ఆపుతాడు రిషి. రిషి కారు ఆపడం వసు చూస్తుంది కానీ పిలిస్తేనే ఎకుదం లేదంటే నడుచుకుని వెళ్ళిపోదాం అన్నట్లుగా ఆటిట్యూడ్ చూపిస్తుంది. అప్పుడు రిషి కారు ఆపింది మీరు ఎక్కడం కోసమే అని అంటాడు. నేను ఇంకెవరి కోసమో అనుకున్నాను అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఫ్రెంట్‌సీట్‌లో కూర్చోబోతే వెనుక సీట్లో కూర్చోమంటాడు రిషి. కారులో కూర్చున్న తర్వాత ఏంజెల్ చాలా భయపడుతుంది తనకి మీరు కాస్త ధైర్యం చెప్పండి మేడం అంటాడు.

ఇంకేమైనా చేయాలా అని కామెడీగా అడుగుతుంది వ‌సు. ఆ ఒక్కటి చేస్తే చాలు అంటాడు. రిషి ఇంటికి వచ్చిన తర్వాత విశ్వనాథం గారి పక్కన కూర్చోని వ‌సు ఆయనకు ధైర్యం చెబుతుంది. విశ్వనాథం ఏంజెల్ భయపడుతుంది నువ్వు ఇక్కడే ఉండొచ్చుగా వస్తారని అడుగుతాడు వ‌సు ఓకే అంటుంది. ఈ లోపు రిషి వచ్చి అక్కర్లేదు పనిమనిషిని మాట్లాడాను మీకు కూడా ఇంట్లో పనులు ఉంటాయి కదా అంటాడు. ఇక రిషి అలా అనడంతో వసు ఏం చేయలేక బయలుదేరుతాను సార్ కిచెన్లో ఏంజెల్ ఉంది తనకి చెప్పేసి వెళ్తాను అని ఏంజెల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఏంజెల్ వసుతో మాట్లాడుతూ నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తుంది.

నాకు ఉండాలని ఉంది కానీ రిషి సార్ ఏమనుకుంటారో అని మనసులో అనుకుంటూనే ఏంజెల్ కోసం ఉండిపోతుంది వ‌సు అప్పుడు విశ్వనాథ్ కి జ్యూస్, రిషికి కాఫీ తీసుకుని ఇద్దరు విశ్వనాథం దగ్గరికి వెళతారు. జ్యూస్‌ విశ్వనాథ్ కి ఇచ్చి నేను విశ్వనాథ్ కి టాబ్లెట్స్ ఇవ్వాలి నువ్వు ఈ కాఫీ ని రిషికి ఇవ్వు వ‌సు అంటూ ఏంజెల్ చెప్తుంది. మొహమాటపడుతోనే రిషి ద‌గ్గ‌రికి వెళ్లి కాఫీ ఇస్తుంది వసుధార‌. కాఫీ ఇచ్చిన తర్వాత కూడా అక్కడి నుంచి వెళ్లకపోవడంతో నాకు ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు రిషి. మహేంద్ర సార్‌తో ఒకసారి మాట్లాడొచ్చు కదా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు అంటుంది. నాకేమీ సలహాలు ఇవ్వవసరం లేదు ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అంటాడు రిషి. మీకు తెలుసు సర్ కానీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే అంటుంది వసుధార‌. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది.