ఈ కూర‌గాయాలు కొన‌క్క‌ర్లే… రేట్లు చూస్తే క‌న్నీళ్లు ఆగ‌వు…!

ప్రస్తుతం రాష్ట్రంలో పలుకుతున్న కూరగాయల ధరలు చూసి జనాలకి కళ్ళు బైర్ల కమ్ముతున్నాయి. మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. మధ్యతరగతి, ఉద్యోగి మార్కెట్ కు వచ్చి ఒక్కో కూరగాయ ధర చూసి కొనాలా? వద్ద? అని భయపడుతున్నారు. టమోటో ధర ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇక ఇప్పుడు టమాటా తో పాటు ఇంకొన్ని కూరగాయలు కూడా రేటు పెరిగిపోయాయి… ఇంకా మనం రోజు కూరగాయలు తెచ్చుకోవాలంటే వేళల్లో డబ్బులు తీసుకెళ్లాలి. కొన్ని కూరగాయలు ధర మరీ పెరిగిపోయింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

టమాటో ₹194 – 267(kg)

పచ్చిమిర్చి ₹113 – 155(kg)

అల్లం ₹208 – 285(kg)

వెల్లుల్లి ₹161 – 221( kg)

రాతి ఉసిరి ₹108 – 149(kg)

చిక్కుడి ₹79 – 109(kg)

మునగకాయ ₹72 – 99(kg)

కూరగాయల రేట్లు చూస్తే ఎంత ధనవంతుడైన సరే ఆశ్చర్యపోతున్నాడు. ఇక మధ్యతరగతి వాళ్ళు అయితే కొనడానికి చాలా ఆలోచిస్తున్నారు. కూరగాయలు ఇంటికాడ పండించుకోవడం మాత్రం చాలా ఉత్తమని చెప్పొచ్చు. రాబోయే కాలంలో కూరగాయలను కూడా బంగారం చూసినట్టు చూడాల్సి వస్తుందేమో.