జీఎస్‌టీ కొత్త రూల్స్…. ఆ పని చేయాల్సిందే…!!

కొత్త నెల ప్రారంభమైంది. ఈ నెల నుంచి జీఎస్ టీ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. రూ. 5 కోట్లు ఆపైన టర్నోవర్ ఉన్న కంపెనీలు, వ్యాపారులు తప్పనిసరిగా తమ బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్‌కు చెందిన ఎలక్ట్రానిక్, ఇ-ఇన్‌వాయి‌ను తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దేశంలో గూడ్స్ మరియు సర్వీసెస్ టాక్స్ జిఎస్టి అమల్లోకి వచ్చిన తరువాత చాలా వేగంగా కొత్త కొత్త మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకువస్తూ డబ్బు తిరిగి కట్టడంలో పారదర్శకత పెంచేందుకు ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.

ఈ కొత్త రూల్స్ ఆగస్టు 1,2023 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ వేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఏడాది మే నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో ఇప్పటివరకు ఇ-ఇన్‌వాయిస్‌ల అమలు రూ. 500 కోట్లు ఆపైన టర్నోవర్ ఉన్న కంపెనీలు, వ్యాపారాలకు మాత్రమే ఉండేది. కానీ దీనిని ఇప్పుడు రూ. 5 కోట్లు టర్నోర్ కు తగ్గించేసింది కేంద్ర ప్రభుత్వం. గడిచిన మూడేళ్లలో చూసుకుంటే ఆ స్థాయిని 100 రెట్లు తగ్గించేసింది. ఇకపై రూ.5 కోట్లకు పైగా టర్నోవర్‌తో వ్యాపారం చేసే వారు తప్పనిసరిగా ఇన్‌వాయిస్‌లను జారీ చేయాల్సిందే. ఈ విషయంపై జూలై 28, 2023 రోజున సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ విభాగం ట్రీట్ చేసింది.

గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జీఎస్‌టీ పెంచుతూ, తగ్గిస్తూ వచ్చారు. కంపెనీకి కొత్త రూల్స్ ప్రయోజకరమైనా? వస్తు సేవల పన్ను జీఎస్టీ కొత్త రూల్స్ తీసుకురావడం ద్వారా ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ ఇవ్వాల్సిందే తాజా పరిణామంతో ఇన్వాయిస్ కిందకు వచ్చే సూక్ష్మ, చిన్న ,మధ్య తరహా పరిశ్రమల సంఖ్య పెరుగుతుంది. ఈ నిర్ణయం కంపెనీలకు, కేంద్ర ప్రభుత్వానికి , వ్యాపార వర్గాలకు ప్రయోజనమే అని కొంతమంది అంటున్నారు. సరఫరాదారులకు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ఐటిసి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందన్నది ఇన్‌వాయిల్ ల ద్వారా సరిగ్గా ఉంటుందని చెబుతున్నారు.