మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ తన అంద చందాలతో ఇప్పటికే అందర్నీతన సినిమాలతో ఆకట్టుకుంటూనే ఉంది. ఒకప్పుడు కుర్రాళ్ళు ఆమెను చూసేందుకే సినిమాలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఐశ్వర్యరాయ్ తమిళ సినిమాలతో ముందుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. మణిరత్నం దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఇద్దరూ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తొలి సినిమాతోనే స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం కొట్టేసింది.
ravoi chandamama
ఈ సినిమా తర్వాత సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన జీన్స్ సినిమాలో హీరోయిన్‌గా నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో విజయలు అందుకున్న ఐశ్వర్యరాయ్ తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో అక్కడికి చెక్కేసి తక్కువ టైంలో ఇండియన్ స్టార్ హీరోయన్ అయిపోయింది. ఇక ఐశ్వర్య తన కెరీర్లు ఒకే ఒక తెలుగు సినిమాల్లో మాత్రమే నటించింది.. అది కూడా మొత్తం సినిమా అంతా కాదు.. కేవలం ఒక్క సాంగ్‌లో మాత్రమే ప్రత్యేకంగా కనిపించి అలరించింది.
నాగార్జున హీరోగా 1999లో వచ్చిన రావోయి చందమామ సినిమాలో ఓ పాటలో ఐశ్వర్యరాయ్ నటించింది. ఇక ఈ సినిమాను జయంత్ సి పరాన్జీ తెరకెక్కించాడు. దర్శకుడికి ఐశ్వర్యరాయ్ ఫ్యామిలీకి మంచి స్నేహ సంబంధం ఉండడంతో రావోయి చందమామ సినిమా సమయంలో శిల్పా శెట్టిని కలవడానికి ముంబై వెళ్లాడు. ఇక అదే సమయంలో ఐశ్వర్యరాయ్ ని కూడా కలిశాడు. అప్పుడు ఐశ్వర్యరాయ్ మీ సినిమాల్లో ఇతర హీరోయిన్లను నటించమని అడుగుతున్నారు నన్ను మాత్రం ఎందుకు ? అడుగరని ప్రశ్నించిందట.
దాంతో జయంత్ శిల్పాశెట్టితో కాకుండా ఐశ్వర్యరాయ్ తో ఆ సాంగ్ చేయించారు. ఐశ్వర్య కూడా ఆ ఒక్క సినిమాలో కనిపించి తెలుగు ఆడియెన్స్‌ను అలరించింది. ఇక ఇప్పుడు రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ దర్శకుడు మణిరత్నం తెర్కెక్కించిన ” పొన్నియిన్ సెల్వన్ ” సినిమాలతో ప్రేక్షకులను మరోసారి తన నటనతో కట్టిపడేసింది ఐశ్వర్యారాయ్.