యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘ దేవర ‘. తన లాస్ట్ గ్లోబల్ హిట్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చేస్తున్న చిత్రం కావడం… పైగా దర్శకుడు కొరటాల శివతో రెండో చిత్రం కావడంతో దేవరపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ పవర్ఫుల్ యాక్షన్ సబ్జెక్టుని దర్శకుడు కొరటాల ఎన్టీఆర్ కోసం డిజైన్ చేయడంతో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దేవర సినిమా నుంచి ఇది వరకే యంగ్ టైగర్ లుక్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అలాగే హీరోయిన్ జాన్వి కపూర్ లుక్స్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో సాలిడ్ లుక్ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది.
దేవరలో విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. సైఫ్ బర్త్ డే ఈనెల 16న కావడంతో మేకర్స్ ఆ రోజు విలన్‌గా సైఫ్ భయంకరమైన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారట. ఎన్టీఆర్ దేవర పాత్రను ఢీకొట్టే శక్తివంతమైన విలన్‌గా సైఫ్ ఎంట్రీ లుక్ ఉండబోతోందని తెలుస్తోంది.