జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి వచ్చినా తన సహజ నటనతో పేరుతెచ్చుకున్నాడు ఈ యువ హీరో. డ్యాన్స్, ఫైట్లు ఇలా అన్ని అంశాల్లో ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు ఎంతో మంది అభిమానులను సైతం సంపాదించుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత ఈ మధ్యనే వరుస విజయాల బాట పట్టాడు. అదే వేళ నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘టెంపర్’ నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవ కుశ’, ‘అరవింద సమేత.. వీరరాఘవ’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో మరో యువ హీరో రామ్ చరణ్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అందులో తారక్ కొమరం భీంగా కనిపించనున్నాడు. అలాగే ఎంతో మంది బాలీవుడ్, హాలీవుడ్ నటులు కూడా పలు కీలక పాత్రలను పోషించనున్నారు.
ఇదిలా ఉండగా.. RRR తర్వాత ఏ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేస్తాడన్న దానిపై ఎన్నో రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. పలువురి తమిళ, కన్నడ, తెలుగు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో 1947, రాజా రాణి ఫేమ్ అట్లీ, ప్రశాంత్ నీల్, కొరటాల శివ తదితర దర్శకులున్నారని ప్రచారం జరిగింది. కానీ, వాటిపై ఏలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా హిట్టిచ్చిన ధర్శకుడు తివ్రిక్రమ్ శ్రీనివాస్, తమిళ ఇండస్ట్రీకి చెందిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రమారన్తో సినిమా చేసేందుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని విశ్వసనీయమైన సమాచారం. ఆర్ ఆర్ ఆర్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించే పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో నటించనున్నట్లు తెలుస్తున్నది. ఆ సినిమాకు ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తున్నది. ఆ మూవిని రాధాకృష్ణ నిర్మించనుండగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా తీసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.
ఇక తివ్రిక్రమ్ సినిమా తరువాత తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో తారక్ ఓ ప్రాజెక్టు చేయబోతున్నాడని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆడుకాలమ్ సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా వెట్రిమారన్ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. తాజాగా ‘అసురన్’ సినిమాతో తెలుగు వాళ్లకు బాగా పరిచయమయ్యాడు. ఈ సినిమాను వెంకటేశ్‌తో తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ డైరెక్టర్ అవిగాక ‘వాడా చెన్నై’, ‘ఆడుకాలమ్’, ‘విసారణై’ వంటి మరెన్నో విభిన్నమైన కథాంశాలతో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. పలుమార్లు కొన్ని విభాగాల్లో జాతీయ అవార్డులను సైతం అందుకున్నాడు. అసురన్ మూవీతో బాగా ప్రాచుర్యం పొందారు. అదీగాక ఆ సినిమాను చూశాకనే వెట్రిమారన్‌తో సినిమా చేయాలని తారక్ డిసైడయ్యాట. అందులో భాగంగానే ఈ ఇద్దరూ ఇటీవల కలిశారని, ఎన్టీఆర్‌కు వెట్రిమారన్ ఒక లైన్ వినిపించాడని, నచ్చడంతో వెంటనే తారక్ తెలిసింది. చూడాలి మరి ఏమవుతుందో?