తాత‌ శతజయంతి వేడుకలకు ఎన్టీఆర్ దూరం… అధికారిక ప్ర‌క‌ట‌న వెన‌క జ‌రిగింది ఇదే…!

గత నెల 28న విజయవాడలో విశ్వ‌విఖ్యాత న‌ట‌సౌర్వ‌భౌమ‌ ఎన్టీఆర్ శ‌త‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వేడుకల్లో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తో పాటు ఏపీ టిడిపి తెలంగాణ నేతలు అందరూ హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రజినీకాంత్ టిడిపి నేతలను అభినందించడంతోపాటు బాలకృష్ణ, చంద్రబాబుల‌ను ప్రశంసించారు. కాగా హైదరాబాదులో ఈరోజు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు మరొకసారి గ‌నంగా నిర్వహిస్తున్నారు.

Brutuses who stabbed NTR - Primepost

కూక‌ట్‌ప‌ల్లి హౌస్ బోర్డింగ్ కైతల‌పూర్ మైదానంలో ఈ శ‌తజయంతి వేడుకలకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని కొనసాగుతున్నాయి. ఈ సభకి ముఖ్య అతిథిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ప్రత్యేక అతిథిగా బాలకృష్ణ రానున్నారు. వీరితో పాటే చాలా మంది స్టార్ హీరోలు కూడా ఈ శతజయంతి వేడుకల కార్యక్రమానికి హాజర‌వుతున్నారు. ఈ శ‌త‌జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందింది. ఈ వేడుకలకు ఎన్టీఆర్ రాబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

Jr NTR To Skip NTR Centenary Celebrations

కాగ‌ ఎన్టీఆర్ ఈ శ‌త‌జయంతి వేడుకలకు హాజరు కావడం లేదని అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. దీనికి ప్ర‌త్యేక కార‌ణం కూడా ఉంది. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ 40వ పుట్టినరోజు కూడా..! కుటుంబ సభ్యులు ముంద‌స్తు చేసుకున్న ఏర్పాట్ల కార‌ణంగానే ఈ వేడుక‌ల‌కు ఎన్టీఆర్ హ‌జ‌రుకాలేకపోతున్నారట. ఈ విష‌యాని స్వయంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్న కమిటీ తెలియజేశారు.