నిజంగానే రు. 1000 కోట్ల ఫిగ‌రా… అంత కంటే ఎక్కువే…!

నరేష్, పవిత్ర లోకేష్ ఎప్ప‌టి నుంచో కలిసే ఉంటున్నారు. వీళ్ళు పెళ్లి చేసుకున్నారా ? లేదా అన్నది పక్కన పెడితే ఇద్దరూ ఒక జంటగా ఒకే ఇంట్లో ఉంటున్న‌ది తెలిసిందే. న‌రేష్‌కు ఇప్ప‌టికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పుడు 60 ఏళ్ల వ‌య‌స్సులో మ‌ళ్లీ పెళ్లి అంటూ నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడు. తాను త్వ‌ర‌లోనే ప‌విత్ర‌ను పెళ్లి చేసుకుంటున్న‌ట్టు చెప్ప‌క‌నే చెప్పాడు. ఇక ఇద్ద‌రూ క‌లిసి ఎక్క‌డిక‌క్క‌డ చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతూనే ఉన్నారు.

ఇప్పుడు తెలుగు మీడియాతో పాటు తెలుగు సోష‌ల్ మీడియాకు, అటు క‌న్న‌డ మీడియాకు వీరిద్ద‌రు మంచి న్యూస్ ఫీడింగ్ ఇచ్చేవాళ్లు అయిపోయారు. ఇక వీరిద్ద‌రి బంధంపై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తూ ఉంటాయి. ఇక ప‌విత్ర‌కు కూడా ఇప్ప‌టికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. క‌న్న‌డ సీరియ‌ల్ న‌టుడు సుచేంద్ర ప్ర‌సాద్‌తో రెండో పెళ్లి జ‌రిగి.. ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు.

ఈ వ‌య‌స్సులో ప‌విత్ర కేవ‌లం న‌రేష్ ఆస్తి చూసే అత‌డితో సంబంధం పెట్టుకుంద‌ని విమ‌ర్శ‌లు చేసే వారు కూడా ఉన్నారు. తాజాగా నరేష్, పవిత్ర కలిసి నటించిన ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమాలో న‌టిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్ చూస్తే ఈ సినిమాలో ప‌విత్ర‌, న‌రేష్ బంధం, ఆస్తుల గొడ‌వ కూడా పెట్టార‌ని తెలుస్తోంది. అలాగే న‌రేష్ ఓ డైలాగ్ కూడా వేస్తాడు.

ఈ డైలాగ్‌లో వెయ్యి కోట్ల ఫిగ‌ర్ అనే మాట కూడా ఉంది. అంటే నరేష్ వెయ్యి కోట్ల‌కు అధిప‌తా… నిజంగానే న‌రేష్ అంత ఆస్తిప‌రుడా ? అన్న చ‌ర్చ‌లు సాగుతున్నాయి. నిజంగానే న‌రేష్ రు. 1000 కోట్ల ఆస్తిప‌రుడు.. అంతే కాదు రు. 2 వేల కోట్ల‌కు పైగానే న‌రేష్‌కు స్థిర‌చ‌రాస్తులు ఉన్నాయి. ఇవ‌న్నీ కూడా న‌రేష్ త‌ల్లి విజ‌య‌నిర్మ‌ల నుంచి న‌రేష్‌కు వార‌స‌త్వంగానే వ‌చ్చాయి. అందుకే న‌రేష్ ఇంత జాలీగా ఉంటాడ‌ని చాలా మంది అంటూ ఉంటారు.