జె.డి చక్రవర్తి ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తర్వాత డైరెక్షన్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన జేడికి మెల్లమెల్లగా సినిమా అవకాశాలు తగ్గాయి. ఇక చాలా కాలం తర్వాత తాజాగా ‘ దయా ‘ వెబ్ సిరీస్ తో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ, ఈషా రెబ్బ, రమ్య నంబీసన్, కమల్ కామరాజు తదితరులు కీరోల్స్ ప్లే చేశారు. ఈ వెబ్ సిరీస్ ఇటీవల ( శుక్రవారం ) డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయింది.
ఈ వెబ్ సిరీస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో భాగంగా జెడి చక్రవర్తి వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేశాడు. ఈ క్రమంలో యాంకర్ తన పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు జెడి. ఇక గతంలో జె.డి చక్రవర్తి – యాంకర్ విష్ణుప్రియ మధ్య అఫైర్స్ ఉందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఓ షోలో పాల్గొన్న విష్ణు ప్రియ తనకు జెడి చక్రవర్తి అంటే ఇష్టమని ఆయన ఓకే చేస్తే పెళ్లి చేసుకుంటానంటూ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేసింది.
దీంతో అప్పట్లో వీరిద్దరి ఎఫైర్ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇటీవల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెడి మాట్లాడుతూ తన పెళ్లి విషయంపై ఇలా స్పందించాడు. నేను పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నానని.. నా పెళ్లి మీరే చేయాలి.. ఎక్కడ దొరకకపోతే నా స్టూడియోలోనే పెళ్లి చేయండి.. కానీ అమ్మాయి ఎవరు అనేది మీ ఇష్టం.. నేను మాత్రం మ్యారేజ్ చేసుకున్నందుకు రెడీగా ఉన్నాను మీరు అమ్మాయిని చూపించండి అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. దీంతో యాంకర్ విష్ణు ప్రియ – చక్రవర్తి మధ్య ఎఫైర్ వార్తలకు జెడి చెక్ పెట్టినట్లు అయింది.