ఎప్పడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు జేసీ బ్రదర్స్. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఉన్నదున్నట్లూ మాట్లాడుతూ.. నోటి దురుసుతో ప్రవర్తిస్తూ కాంట్రవర్సీ అవుతుంటారు. మొన్నటి మొన్న మూడు రాజధానుల విషయంలోనూ ఇలాగే మాట్టాడి వివాదంలో చిక్కుకున్నారు. ఆ తరువాత పోలీసు స్టేషన్‌దాకా వెళ్లారు. ఇదిలా ఉండగా తాజాగా వారు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏకం పోలీసుల సంతకాలనే ఫోర్జరీ చేసినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఇంతకి అసలు విషయం ఏమిటంటే.. లారీ వంటి భారీ వాహనాలను విక్రయించినప్పుడు ఎన్‌వోసీ సమర్పించాల్సి ఉంటుంది. దానిని పోలీసు శాఖ వారు మాత్రమే అందజేస్తారు. ఈ క్రమంలో జేసీ బ్రదర్స్‌కు చెందిన ట్రావెల్స్‌కు సంబంధించి ఆరు లారీలను ఇటీవల విక్రయించారు. అయితే అందుకు సంబంధించిన ఎన్‌వోసీ పత్రాలను పోలీసులు ఇవ్వలేదు. ట్రావెల్స్ నిర్వాహకులైన జేసీ బ్రదర్స్ ప్రోద్బలంతో పలువురు తాడిపత్రి ఎస్ఐ సంతకాన్ని పోర్జరీ చేసి నకిలీ ఎన్‌వోసీలను సృష్టించారు.
ఇదిలా ఉండగా ఈ సమాచారం తెలిసిన పోలీసులు జేసీ ట్రావెల్స్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. సోదాలు చేపట్టగా పలు నకిలీ డాక్యుమెంట్లు సైతం బయటపడడం గమనార్హం. సంతకాలను పోర్జరీ చేసిన నలుగురు నిందితుల్లో ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి ల్యాప్‌టాప్‌లు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి నిందితుల గురించి గాలింపు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీ ట్రావెల్స్ పలు బస్సులను నడుపుతున్నదని ఏపీ ఇప్పటికే పలు చర్యలకు దిగుతున్నది. తాజాగా ఈ ఉదంతం వెలుగు చూడడం గమనార్హం. దీనిపై జేసీ బ్రదర్స్ ఎలా స్పందిస్తారో
చూడాలి మరి.
మరో వివాదంలోకి జేసీ బ్రదర్స్.. పోలీసుల సంతకాలు పోర్జరీ?
