రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంశం కొత్త మలుపులు తీసుకుంటున్నది. కేసులో మరికొందరి పేర్లు వెలుగు లోకి వచ్చాయి. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించడానికి ముందే అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని నేతలు కొందరు తమ బీనామీలతో పెద్ద మొత్తంలో భూములను కొనుగోలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తత వైసీపీ ప్రభుత్వం సీఐడీ దర్యాప్తును చేయిస్తున్నది. ఇక ఇన్‌సైడర్ కేసు దర్యాప్తును అధికారులు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇప్పటికే సుమారు 750 మంది తెల్లరేషన్ కార్డుదారులు కోట్ల విలువైన భూములను కొనుగోలు చేశారని గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా ఆ కేసు జాబితాలోకి మరికొందరి పేర్లను చేర్చింది సీఐడీ. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో మరో ఏడుగురి పేర్లను గుర్తించింది. ఈ మేరకు నాగమణి, నర్సింహారావు, అనురాధ, కొండలరావు, భూక్య నాగమణి, జమేదార్, అబ్డుల్ అనే వ్యక్తులపై కేసులు నమోదు చేయడం కలకలం రేపుతున్నది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఐడీ అధికారు మాత్రం ముమ్మరంగా కేసును దర్యాప్తును చేస్తున్నారు. త్వరంలోనే చార్జిషీటును దాఖలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.
ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో మరికొందరి పేర్లు చేర్చిన సీఐడీ
