జాన్వీ క‌పూర్‌.. డ్యాన్స్ సూప‌ర్‌.. సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్‌

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల త‌న‌య‌ జాన్వీ కపూర్‌ తల్లి నుంచి అందంతోపాటు అభినయాన్ని కూడా వార‌స‌త్వంగా అందిపుచ్చ‌కున్న‌ది. త‌న మొదటి సినిమా ధడక్‌లో అద్వితీయ‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించి విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌ల‌ను పొందింది. మంచి మార్కులు కొట్టేయ‌డంతో పాటుగా భారీ విజ‌యాన్ని అందుకుంది. ప్రస్తుతం విజ‌య‌వంత చిత్రాల నిర్మాత‌గా బాలివుడ్‌లో పేరును సంపాదించుకున్న క‌ర‌ణ్ జోహార్ నేతృత్వంలో మొగలుల కాలం నాటి చారిత్రక కథాంశంతో తెర‌కెక్క‌నున్న ‘తఖ్త్‌’లో న‌టించ‌నుంది. భారీ బడ్జెట్‌తో నిర్మిత‌మ‌వ‌తున్న ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌, కరీనా కపూర్‌, అనిల్‌ కపూర్‌, భూమి పడ్నేకర్ త‌దిత‌ర దిగ్గ‌జ న‌టీన‌టులు ముఖ్య‌పాత్ర‌ల్లో క‌న‌పించ‌నున్నారు. వ‌చ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుండ‌గా, 2021 డిసెంబర్‌లో క్రిస్మస్ కానుక‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు సమాచారం.

ఇదిలా ఉండ‌గా.. ఈ చిత్రంలో ముఖ్య‌భూమిక‌ను పోషించ‌నుంది జాన్వీక‌పూర్‌. త‌న పాత్ర చిత్ర‌ణ కోసం డ్యాన్స్‌ను ప్రాక్టీస్‌ను విప‌రీతంగా చేస్తున్న‌ది. తాజాగా త‌ను డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఓ వీడియోను జాన్వీ క‌పూర్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. సుమారు ఒక నిమిషం పాటు నిడివి ఉన్న ఆ వీడియోలో పాత హిందీ పాటకు కొరియోగ్రాఫర్‌తో కలిసి జాన్వీ అదిరిపోయే స్టెప్పులు వేసింది. అదీగాక ఎక్కడా కొంచెం కూడా తడబడకుండా అద్వీతీయ‌మైన హావాభావాల‌ను ప్ర‌ద‌ర్శించి వహ్వా అనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. జాన్వీ డ్యాన్స్‌ను చూసిన నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచేస్తున్నారు. తల్లికి తగ్గ తనయురాలు అంటూ కామెంట్ల‌ను గుప్పిస్తున్నారు.

Tags: anilkapoor, Dance, janhvi kapoor, karan johar, ranveer singh, thakth