రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రులు అంటూ ఎవరూ ఉండరు. నిజమే ఎప్పుడు ఎవరు కలుస్తారో.. ఎవరు విడిపోతారో చెప్పడం చాలా కష్టమే. ఇప్పుడు తాజాగా ఏపీలో ఇదే చర్చ కొనసాగుతున్నది. రాజధాని అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా బీజీపీ కలిసి పోరాటం చేస్తానని బీరాలు పలికిన జనసేనానని ఇప్పుడు కాషాయదళంతో కటీఫ్ పలుకుతున్నాడని తెలిసింది. ఇకపై ఏపీలో ఏ రాజకీయ కార్యాచరణ చేపట్టినా ఉమ్మడిగా చేపడతామని ఇరు పార్టీలు సంయుక్తంగా ప్రకటించి నెల కూడా తిరగకుండానే తిరిగి ఎవరి దారి వారు చూసుకుంటుండడం ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనలో కమలం నేతలు ఎవరూ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. మరి ఇంతకీ ఆ రెండు పార్టీలకు ఎక్కడ విభేదాలు పొడచూపాయి? ఎందుకు అంతలోనే తెగదెంపులు చేసుకుంటున్నారు? అన్న చర్చ జోరుగా కొనసాగుతున్నది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. కొంతకాలంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, బీజేపీ, కేంద్రం ప్రాధాన్యత ఇవ్వడం మన పీకేకు మింగుడు పడడం లేదట. అదీగాక త్వరంలోనే కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ భాగస్వామ్యం కానుందని తెలుస్తున్నది. అందుకు సంబంధించి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు మంత్రులు సైతం పరోక్షంగా హింట్ ఇస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే బీజేపీకి జనసేన అధినేత పీకే దూరంగా జరుగుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటించనుండనున్నారు. ఆ పర్యటనలో జనసేనతో పాటు బీజేపీ శ్రేణులు కూడా పాల్గొంటాయా ? లేదా ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.