ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రిలో జ‌న‌సేన‌కు చంద్ర‌బాబు ఇచ్చే సీట్లు ఇవే…!

ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలలో టిడిపి – జనసేన మధ్య పొత్తు ఉంటుందని రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు తమ అంతర్గత సంభాషణలో అంగీకరిస్తున్నారు. జనసేనతో పొత్తు ఉంటే ఆ పార్టీకి ఎన్ని ? సీట్లు కేటాయిస్తారు.. ఏయే సీట్లు జనసేనకు దక్కవచ్చు అన్నదానిపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చలు కూడా మొదలయ్యాయి. జనసేన ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో ఎక్కువగా సీట్లు కేటాయించాలని కోరుతున్న మాట వాస్తవం.

ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేనకు గరిష్టంగా నాలుగు సీట్లు దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికలలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచిన భీమవరం తో పాటు.. పవన్ సొంత నియోజకవర్గం నరసాపురం అలాగే తాడేపల్లిగూడెంతో పాటు మరో నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించనున్నారు. జనసేనకు కేటాయించే నాలుగో నియోజకవర్గంగా నిడదవోలు పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

ఈ నాలుగు సీట్లలో గత ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన జనసేన భీమవరం, నరసాపురంలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ రెండు చోట్ల కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఇక తాడేపల్లిగూడెంలోనూ ఆ పార్టీ కీలక నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. ఖ‌చ్చితంగా బొలిశెట్టి కోసం గూడెం వ‌ద‌లాల్సిందే. దీంతో ఈ మూడు సీట్ల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇక నాలుగో సీటుగా తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన నిడదవోలు సీటును జనసేన డిమాండ్ చేస్తుంది.

ఒక‌వేళ ఏదైన అద్భుతం జ‌రిగితే ఉమ్మ‌డి జిల్లాలోని మూడు ఎస్సీ, ఒక ఎస్టీ మొత్తం నాలుగు రిజ‌ర్వ్‌డ్ సీట్ల‌లో మ‌రో స్థానాన్ని కూడా కేటాయించే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఖ‌చ్చితంగా ఈ సీట్లు మాత్ర‌మే టీడీపీ జ‌న‌సేన‌కు వ‌ద‌ల‌డం ఖాయం.. టీడీపీ రాష్ట్ర నేత‌ల అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లోనూ ఈ సీట్ల పేర్లే జ‌న‌సేనకు కేటాయించే లిస్టుల్లో ఉన్నాయి.