జనసేన టిడిపి కూటమి ఏర్పడకుండా వైసిపి భారీ స్కెచ్… గెలుపు మాత్రం కూటమిదే…!

యువగళం పాదయాత్ర పునః ప్రారంభమైంది. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆపేసిన పాదయాత్రను చంద్రబాబు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత లోకేష్ తిరిగి ప్రారంభించారు. యువగళం పాదయాత్రలో లోకేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. టిడిపి జనసేన పొత్తు ఏర్పడితే వైసీపీకి కచ్చితంగా ఓటమి తప్పదు అనే భావనతో, పొత్తు పెట్టుకోకుండా ఉండేందుకు ఆరు నెలల ముందు నుంచి వైసీపీ పెద్దలు బిజెపితో చర్చలు జరిపారని లోకేష్ అంటున్నారు.

ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు టిడిపి జనసేన కూటమి వలన వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతుందని వైసిపి నేతలు కూడా అర్థమైందని లోకేష్ అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో టిడిపికి జనసేనకు పట్టుంది. రెండు పార్టీలకు సమానమైన బలాబలాలు ఉన్నాయి. వైసీపీకి కూడా పట్టుంది. కానీ టిడిపి జనసేన రెండూ కలిస్తే మాత్రం వైసీపీ గెలుపు కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అందుకే జనసేన టీడీపీ కలవకుండా ఉండేందుకు బిజెపిని మధ్యవర్తిగా ఉంచి, పవన్ తో మాట్లాడించారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని తిప్పి పంపించడానికి మాత్రమే ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నామని చంద్రబాబు పవన్ చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఇప్పుడు టిడిపి జనసేన కూటమికి కలిసి వస్తుంది. వైసీపీ ఎన్ని వ్యూహాలు పన్నినా ఈసారి వైసీపీ గెలుపు కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.