టాలీవుడ్ లో నందమూరి కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఎవరు అందుకొని ఓ గొప్ప పొజిషన్‌ను క్రియేట్ చేశారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కాగా అయిన తర్వాత ఆయన నట వారసులుగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణణ వరుస విజయాలతో తెలుగులోనే నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు. అదేవిధంగా ఈ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో భారీ క్రేజ్ అందుకొని స్టార్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్నాడు.
అయితే ఇప్పుడు ఈ బాబాయ్- అబ్బాయిల కాంబోలో ఒక సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఉన్నారు. అయితే గతంలో ఓ స్టార్ దర్శకుడు ఇలాంటి సాహసమే చేశారు. ఆ దర్శకుడు మరెవరో కాదు వంశీ పైడిపల్లి.. వంశి- ఎన్టీఆర్-బాలకృష్ణ కాంబోలో ఓ సినిమా తీయాలని ఎంతో ట్రై చేశారు. అయితే ఎన్టీఆర్ తో నటించడం బాలకృష్ణ కు ఇంట్రెస్ట్ లేదో.. లేకపోతే నిజంగానే కాల్ షీట్ లు అడ్జస్ట్ చేయలేదో తెలియదు కానీ సినిమా చేస్తానని చెప్పి తన డేట్లు అడ్జస్ట్ చేయలేదు.. ఆ తర్వాత బాలయ్య ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు బృందావనం.
ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కేరీర్‌లోనే సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర కోసం ముందుగా బాలకృష్ణను అప్రోచ్ అయ్యారట దర్శకుడు వంశీ పైడిపల్లి. అయితే అప్పటికే వేరే సినిమాల్లో బిజీగా ఉన్నారని కాల్ షీట్స్ లేవని ఒక 2 ఇయర్స్ అగితే సినిమా చేస్తానని చెప్పి మళ్లీ తర్వాత ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. ఇక దాంతో వంశీ పైడిపల్లి సైతం చేసేదేమీ లేక అదే ఆ క్యారెక్టర్ ను ప్రకాష్ రాజ్‌తో చేయించి సినిమాను తెరకెక్కించాడు. ఆ తర్వాత సినిమా విడుదలై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఇక మరి రాబోయే రోజులైనా ఈ బాబాయ్- అబ్బాయిల కలయికలో సినిమా వస్తుందో లేదో చూడాలి.