‘ జైలర్ ‘.. ఫస్ట్ డే కలెక్షన్స్.. ర‌జ‌నీయా మ‌జాకానా…!

తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న రజనీకాంత్ కొట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవల నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో రజనీకాంత్ హీరోగా తమన్న హీరోయిన్గా వచ్చిన సినిమా జైలర్ నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, సునీల్, జాకీ ష్రాప్, యోగి బాబు, మోహన్లాల్ తదితరులు కీరోల్స్‌ప్లే చేసిన ఈ మూవీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజై హిట్ టాక్‌ని సంపాదించుకుంది. మొదటి షో తో అందరి దృష్టిని ఆకర్షించిన జైలర్ కలెక్షన్స్ విషయంలోనూ కొత్త రికార్డులను సృష్టించింది.

తెలుగు రాష్ట్రాల్లో రూ. 9 కోట్ల గ్రాస్‌వ‌సూళ్ళు సాధించిన జైలర్.. కేరళలో రూ. 5 కోట్లు, కర్ణాటకలో రూ10 కోట్లు ఇలా ఆల్ ఇండియా లెవెల్ లో రూ. 49 కోట్ల భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. తమిళనాడులో రూ.52 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్‌ సంపాదించిన జైలర్.. రూ.80 కోట్ల భారీ కలెక్షన్లు రాబ‌ట్టింద‌ట‌. ఈ ఏడాది ఫస్ట్ డే అధిక కలెక్షన్స్ వసూలు చేసిన టాప్ త‌మిళ్‌ మూవీగా రికార్డులు సాధించింది జైల‌ర్.