నిఖిల్ ‘ స్పై ‘ లో జై బాలయ్య… న‌ట‌సింహం నామ‌స్మ‌ర‌ణ ఉంటే బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌రే..!

ప్రస్తుతం టాలీవుడ్ బాలయ్య టైమ్‌ మామూలుగా లేదు.. టాలీవుడ్ యంగ్ హీరోలను మించిన భారీ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు బాలయ్య. ఇప్పటికే ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి తో బాక్సాఫీస్ దగ్గర వీరంగం సృష్టించాడు. అంత‌కు ముందు క‌రోనా త‌ర్వాత అఖండ సినిమాతో థియేట‌ర్ల‌లో అఖండ గ‌ర్జ‌న‌మోగిస్తూ పూన‌కాలు తెప్పించాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బాలయ్య అనిల్ రావిపూడి తో భగవంత్‌ కేసరి చేస్తున్నాడు.

ఈ విషయం ఇలా ఉంచితే టాలీవుడ్‌లో ఉన్న మీడియం రేంజ్ హీరోల సినిమాలలో బాల‌య్య‌ ప్రస్తావన ఇటీవ‌ల కాలంలో గట్టిగానే వినిపిస్తోంది. నాచురల్ స్టార్ నాని హీరోగా వ‌చ్చిన‌ కృష్ణగాడి వీరప్రేమగాథ‌ సినిమాలో నాని బాలయ్య అభిమానిగా కనిపించాడు. ఇప్పుడు మరో యంగ్ హీరో నిఖిల్ తాజా సినిమాలో మ‌రోసారి బాలయ్య అభిమానిగా కనిపించబోతున్నాడ‌ట‌.

నిఖిల్ సిద్ధార్థ హీరోగా వస్తున్నపాన్ ఇండియా మూవీ స్పై. భారత స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా వస్తున్న ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో నిఖిల్, బాలయ్య అభిమానిగా నటిస్తున్నాడంటున్నారు. అంతే కాకుండా ఈ మూవీలో జై బాలయ్య సాంగ్ బీట్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

గతంలో నిఖిల్ కిరాక్ పార్టీ సినిమాలో కూడా బాలయ్య అభిమానిగా నటించాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో వస్తున్న స్పై సినిమాలో బాలయ్య అభిమానిగా నిఖిల్ కనిపించడం అంటే సినిమాకు వ‌చ్చే అప్లాజ్ మామూలుగా ఉండదు. ఈనెల 29న స్పై ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీ విష్ణు సామ‌జ‌వ‌ర‌గ‌మన సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది.