ప్రభాస్‌తో న‌టించ‌న‌ని మెహం మీదే చెప్పేసిన కాజ‌ల్‌… !

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. చిన్న సినిమాల్లో నటిస్తూనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్న ప్రభాస్ బాహుబలి సినిమా ముందు కొన్ని లవర్ బాయ్ రోల్స్ లో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ నటించిన ఎన్నో హిట్ పెయిర్ కాంబినేషన్స్‌లో కాజల్ అగర్వాల్ – ప్రభాస్ కాంబినేషన్ కూడా ఒకటి. ప్రభాస్ – కాజల్ అగర్వాల్ తో మొదటిగా డార్లింగ్ సినిమాలో నటించగా ఆ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. డార్లింగ్ సినిమాలో ప్ర‌భాస్ చెప్పిన డైలాగ్ డెలివ‌రీ ఇప్ప‌ట‌కీ మ‌న‌కు అలా మ‌దిలో ఉండిపోతుంది.

ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్‌. ఈ సినిమాలో తాప్సీ ప‌న్ను సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కాజ‌ల్ – ప్ర‌భాస్‌ జంటకి మంచి గుర్తింపు వచ్చింది.
ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను దిల్ రాజు త‌న బ్యాన‌ర్లో నిర్మించారు.

అయితే ఈ రెండు సినిమాల తర్వాత కాజల్ ప్రభాస్ కి జోడిగా మరొక ఛాన్స్ కూడా వచ్చిందట. ఆ సినిమాని ఏవో రీజన్స్ తో కాజల్ రిజెక్ట్ చేసిందట. ఇంతకీ ఆ సినిమా ఏంట‌నుకుంటున్నారా ? రాఘ‌వ లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన రెబల్. ఈ సినిమాలో మొదటగా కాజల్ ని హీరోయిన్ అనుకున్నారట. కాజల్ ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో తమన్నా, దీక్షా సేత్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో కాజ‌ల్ చేసి ఉంటే ప్ర‌భాస్ – కాజ‌ల్ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడు సినిమాలు వ‌చ్చి ఉండేవి.