టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అవడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ తీవ్రస్థాయిలో నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును విడుదల చేయాలంటూ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. మరోవైపు ఐటీ ఉద్యోగులు, ప్రజాసంఘాలు కూడా నిరసనలకు మద్దతు ఇస్తున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా పలువురు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన టిడిపి మాజీనేత మోత్కుపల్లి నరసింహులు సైతం దీనిపై స్పందించారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే అందుకు పూర్తి బాధ్యత జగన్‌దే అన్నారు. ఇక టిడిపి నేత కొమ్మారెడ్డి పట్టాభి అయితే అదిరిపోయే సెటైర్లతో జగన్ పై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ బెయిల్‌పై దర్జాగా జీవిస్తూ తన బెయిల్ జీవితాన్ని 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి పట్టరాని ఆనందంతో పదో బెయిల్ వార్షికోత్సవం చేసుకుంటున్నారని.. జగన్ సాధించిన ఈ ఘనతను గుర్తించి ఎక్కువ కాలం బెయిల్‌పై జీవించిన వ్యక్తిగా ఆయనకు ఒక రికార్డు ఇవ్వాలని కోరుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి మెయిల్ కూడా పెట్టినట్టు పట్టాభి ఎద్దేవా చేశారు.
ఈ శుభ సందర్భంగా ఆయన కూడా పట్టాభి అదిరిపోయే పంచ్‌లు విసిరారు. ఇప్పుడు పట్టాభి చేసిన 10వ బెయిల్ వార్షికోత్సవం పట్టరాని ఆనందంలో జగన్ అన్న పంచ్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది.