చంద్ర‌బాబు అరెస్టుతో రంగంలోకి బాలయ్య‌…. వాళ్ల‌తో సీరియ‌స్ డిస్క‌ర్ష‌న్‌…!

నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం అంతకు అంత అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టు చేసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన బాలయ్య చంద్రబాబును పరామర్శించడంతోపాటు తన సోదరి భువనేశ్వ‌రికి ధైర్యం చెప్పారు. జగన్ తో పాటు జగన్ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాలయ్య ఇంత సీరియస్ గా పొలిటికల్ విమర్శలు చేయడం ఇదే మొదటిసారి.

ఇక చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఆయన మంగళగిరిలోనే మకాం వేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బాలయ్య నాయకత్వంలో పార్టీ నాయకులు సమావేశం అయ్యారు. పార్టీ పరిస్థితి ఇతరత్రా అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజా -య‌నమల రామకృష్ణుడు – నక్కా ఆనందబాబు తో పాటు పార్టీ సీనియర్ నేత య‌రపతినేని శ్రీనివాసరావు – కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తదితరులు ఉన్నారు.

వాస్తవానికి బాలయ్య ఎన్నికల నేపథ్యంలో డైరెక్ట్ గా రంగంలోకి దిగితే బాగుంటుందని పార్టీ నేతలు చాలామంది కోరుతున్నారు. రకరకాల కారణాల వల్ల అటు సినిమాలతో బిజీగా ఉండటంవల్ల బాలయ్య ఎప్పుడు సీరియస్ గా పాలిటిక్స్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం లేదు. హిందూపురం నియోజకవర్గం వరకు తిరుగులేని విధంగా అభివృద్ధి చేశారు. అందుకే గత ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓడిపోయినా హిందూపురంలో అంతకుముందు మెజార్టీ కంటే బాలయ్యకు ఎక్కువే వచ్చింది.

ఈసారి 2019లో వచ్చిన మెజార్టీని కూడా క్రాస్ చేయబోతున్నాడు.ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుతో బాల‌య్య ఒక్క‌సారిగా సీరియ‌స్ పాలిటిక్స్ వైపు దృష్టి పెట్ట‌డంతో నంద‌మూరి, టీడీపీ అభిమానులు బాల‌య్య ఎన్నిక‌ల‌య్యే వ‌ర‌కు సినిమాలు ప‌క్క‌న పెట్టి ఏపీలో రాజ‌కీయ ర‌ణక్షేత్రంలో ఉండాల‌ని కోరుతున్నారు. ఒక్క బాల‌య్య మాత్ర‌మే కాదు… నంద‌మూరి ఫ్యామిలీ అంతా ఈ టైంలో ప్ర‌జ‌ల్లో ఉంటే ఈ ఇంపాక్ట్ అయితే వేరుగా ఉండ‌నుంది.