జ‌గ‌న్ రైట్ హ్యాండ్ జ‌న‌సేనాలోకా… వైసీపీ మీడియాలో వైర‌ల్‌…!

ఏపీలో సాధారణ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది జంప్ జలానీ కార్యక్రమాలు ఎక్కువ అవుతాయి. అధికార వైసీపీలో బండి ఇప్పటికే ఓవర్ లోడ్ అయింది. ఆ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేదని పైగా వచ్చే ఎన్నికలలో టిక్కెట్లు రావిని భావిస్తున్న వారిలో.. చాలామంది బయటకు వచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇక జగన్ వచ్చే ఎన్నికలలో తమకు టిక్కెట్ ఇవరని భావిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలే.. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేశారని వైసీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Balashowry Vallabhaneni | ElectWise

ఈ క్రమంలోనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక జగన్ 2019 ఎన్నికలకు ముందే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో పొందరని పక్కన పెట్టేశారు. ఇక ఈసారి కూడా కొందరిని పక్కన పెట్టేస్తారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే వైసిపి వర్గాలలోనే ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. జగన్‌కు అత్యంత సన్నిహితుడు.. ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట. బాలశౌరి దివంగత వైయస్సార్.. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా ఉంటూ వస్తున్నారు.

ఢిల్లీలో కూడా జగన్ బాలశౌరికి ఎన్నో కీలక బాధ్యతలు అప్పగించారు. బాలశౌరి 2004లో తెనాలి నుంచి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ నుంచి నరసరావుపేటలో ఓడిన ఆయన.. 2014లో వైసిపి నుంచి గుంటూరులో పోటీ చేసి జయదేవ్ మీద ఓడిపోయారు. ఇక గత ఎన్నికలలో మచిలీపట్నం నుంచి విజయం సాధించారు. అయితే ఈసారి బాలశౌరి జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నారట.

నిజంగా బాలశౌరి పార్టీ మారటం అన్నది పెద్ద షాక్. ఇది నమ్మదగ్గ న్యూస్‌గా అయితే లేదు. అయితే వైసిపికి హార్ట్ కోర్‌గా పనిచేసే ఓ ప్రముఖ వెబ్‌సైట్లో ఈ వార్త రావడంతో దీనిపై సరికొత్త చర్చలు అయితే మొదలవుతున్నాయి. కొంతకాలంగా మాజీ మంత్రి పేర్ని నానికి, బాలశౌరికి మధ్య సఖ్యత లేదు. బందరులో రాజకీయ ఆధిపత్యం కోసం వీరిద్దరూ గొడవలు పడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు బాలశౌరి పార్టీ మారుతున్నారన్న గుసగుసలు అయితే వైసిపి వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.

Tags: AP, ap politics, intresting news, janasena, janasena cheaf pawan, latest news, latest viral news, social media, social media post, telugu news, trendy news, viral news, ysrcp