టీడీపీలో ఆ ఒక్క‌డితోనే జ‌గ‌న్‌కు బిగ్ ట్ర‌బుల్‌…!

విశాఖలో ఒకే ఒక్కడు జగన్‌ వ్యూహాలకు ఏ మాత్రం చిక్కడం లేదు..ఎంత ఓడించాలని చూస్తే..అంతగా ఆ నేత బలం పెరుగుతుంది. ఇప్పటికే వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. కానీ నాల్గవ సారి ఆయన్ని ఎలాగైనా గెలవనివ్వకూడదని జగన్ ట్రై చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఆయనని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టారు. కానీ ఆయన ఎక్కడ తగ్గలేదు..ఇంకా ఎదురునిలబడి పోరాడుతున్నారు.

అందుకే ప్రజల మద్ధతు ఆయనకు తగ్గలేదు..నాల్గవ సారి కూడా విజయం అందుకోవడానికి రెడీగా ఉన్నారు. అలా నాల్గవ సారి గెలవడానికి రెడీ అయిన నాయకుడు ఎవరో కాదు…విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు. అసలు ఇంతవరకు విశాఖ సిటీలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలుచుకోలేదు. గత ఎన్నికల్లో కూడా అదే పరిస్తితి. కానీ అధికారంలోకి వచ్చాక విశాఖ నగరాన్ని దక్కించుకోవడానికి అధికార బలం మొత్తం ఉపయోగించారు.

సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ని వైసీపీలోకి లాగారు. నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లాంటి వారిని సైలెంట్ చేశారు. అటు వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు తన పని తాను చేసుకునేలా చేశారు. కానీ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడిని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన లొంగలేదు. వెనక్కి తగ్గలేదు. ఈయన వరుసగా మూడుసార్లు ఈస్ట్ లో గెలుస్తూ వచ్చారు. అయితే ఈయన చెక్ పెట్టడానికి జగన్ వేయని ఎత్తు లేదు.

విశాఖ రాజధాని పేరుతో ఈయన్ని గట్టిగా టార్గెట్ చేశారు. అక్రమ కట్టడాలని ఆరోపించి వెలగపూడి..ప్రాపర్టీ డ్యామేజ్ చేయడానికి చూశారు. అయినా సరే వెలగపూడి వెనక్కి తగ్గలేదు. తనని నమ్ముకున్న ప్రజల కోసం నిలబడ్డారు..పనిచేశారు. అందుకే ఈస్ట్ ప్రజల మద్ధతు వెలగపూడికి తగ్గలేదు. లేటెస్ట్ సర్వే లో కూడా మళ్ళీ ఈస్ట్ లో వెలగపూడి గెలవడం ఖాయమని తేలింది. మొత్తానికి ఈ ఒక్కడు జగన్‌ని పెద్ద ట్రబుల్ పెడుతున్నారు.

Tags: AP, ap political news, chandra babu naidu, latest news, social media, tdp leaders, tdp party, velagapudi rama krishna, viral news