బాలయ్యకు ప్రేమతో జగన్.. హిందూపురంలో చేతులెత్తేశారుగా…!

జగన్ అధికారంలోకి వచ్చాక టి‌డి‌పి నేతలకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే..అంటే అధికార బలాన్ని, పోలీసులని ఉపయోగించుకుని ఏ విధంగా టి‌డి‌పి నేతలని ఇబ్బంది పెడుతూ వస్తున్నారో తెలిసిందే. రాజకీయంగా, ఆర్ధికంగా అన్నీ రకాలుగా ఇబ్బందులు గురి చేయడానికే చూశారు. ఆఖరికి టి‌డి‌పి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుని ఏ సైతం ఏ విధంగా టార్గెట్ చేశారు..ఆయన్ని ఎన్ని రకాలుగా తిట్టిస్తున్నారు..ఎంతగా టార్గెట్ చేస్తున్నారో తెలిసిందే.

Hindupur Railway Station (HUP) : Station Code, Time Table, Map, Enquiry

ఇక ఆయన సొంత స్థానం కుప్పంలో ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. అక్కడ ఆయన్ని ఓడించడానికి మంత్రి పెద్దిరెడ్డి ఎలాంటి ఎత్తులు వేస్తున్నారు..ప్రజలని ఎలా బెదిరిస్తున్నారు..పంచాయితీ, పరిషత్, కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ ఎలా గెలిచిందో తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో కుప్పంలో బాబుని ఓడించడం టార్గెట్ గా జగన్ పావులు కదుపుతున్నారు.

Balayya to play a no-nonsense cop in KS Ravikumar's next | Telugu Movie  News - Times of India

మరి ఇలాంటి ప్రయత్నాలే బాలయ్య పై చేస్తున్నారా? హిందూపురంలో రాజకీయం చేస్తున్నారా? అంటే అబ్బే అలాంటిదేమీ కనిపించడం లేదు. అసలు బాలయ్యపై రాజకీయంగా విమర్శలు పెద్దగా లేవు. అలాగే రాజకీయంగా హిందూపురంలో బాలయ్యకు చెక్ పెట్టేలా జగన్ రాజకీయం లేదు. స్థానిక ఎన్నికలు, మున్సిపల్, పంచాయితీ ఎన్నికలు అంటే..రాష్ట్రంలో అన్నిచోట్ల అధికార బలాన్ని ఉపయోగించి వైసీపీ గెలిచింది..హిందూపురంలో అలాగే గెలిచింది.

Jagan hints at shifting to Visakhapatnam in July

కానీ హిందూపురం నియోజకవర్గంలో రాజకీయంగా బాలయ్యకు చెక్ పెట్టేలా జగన్ పెద్దగా కార్యక్రమాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. స్వతహాగా జగన్..బాలయ్య అభిమాని కావడంతోనే..హిందూపురంని టచ్ చేయడం లేదా? అనే చర్చ ఉంది. ఎందుకంటే కుప్పం, మంగళగిరి స్థానాల్లో చేస్తున్న రాజకీయం హిందూపురంలో చేయడం లేదు.

అసలు హిందూపురం ప్రస్తావన వైసీపీలో రావడం లేదు. టార్గెట్ కుప్పం అని వైసీపీ అంటుంది గాని..హిందూపురం అనడం లేదు. పైగా హిందూపురంలో వైసీపీకి బలమైన నాయకుడు లేరు. అక్కడ వైసీపీలో అంతర్గత పోరు ఉంది. ఇలాంటి పరిణామాల వల్ల హిందూపురంలో అసలు వైసీపీ గెలిచే పరిస్తితి లేదని..మళ్ళీ అక్కడ బాలయ్య గెలవడం ఖాయమని తేలిపోయింది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp