ఆ రెండు ఎంపీ సీట్లు మ‌న‌కు రావ్‌… ముందే చేతులెత్తేసిన జ‌గ‌న్‌…!

ఔను.. ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో ఎవ‌రిని అడిగినా.. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి కృష్ణాలో రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2014లో రెండు కూడా టీడీపీ ద‌క్కించుకుంది. విజ‌య‌వాడ‌, మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ జెండా రెప‌రెప‌లాడింది. అయితే.. 2019కి వ‌చ్చేసరికి.. మ‌చిలీప ట్నం వైసీపీ ఖాతాలో ప‌డింది. విజ‌య‌వాడ మ‌ళ్లీ టీడీపీకే ద‌క్కింది. వైసీపీ విశ్వ‌ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లిం చలేదు.

Is trouble brewing in the Kesineni family?

అయితే.. ఈ ద‌ఫా 2024 ఎన్నిక‌ల్లో మాత్రం ఈ రెండు కూడా టీడీపీకే ద‌క్క‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌చిలీపట్నం ఎంపీగా ఉన్న వైసీపీ నాయ‌కుడు బాల‌శౌరి ఇక్క‌డ నుంచి పోటీ చేస్తే.. ఓడించేందుకు సొంత పార్టీ నాయ‌కులే రెడీగా ఉన్నార‌నే ది ఒక‌న్నాళ్లుగా వినిపిస్తున్న వాద‌న‌. ఈ నేప‌థ్యంలో ఆయ‌న న‌ర‌సారావుపేట‌కు వెళ్ల‌నున్నార‌ని స‌మాచారం. దీంతో ఇక్కడ కొత్త వారికి అవ‌కాశం ఇవ్వాల‌నేది ప్లాన్‌.

ఇక విజ‌య‌వాడ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసే నాయ‌కుడు తెర‌మీదికి రాలేదు. గ‌త ఎన్నిక‌ల్లో పొట్లూరి వీర‌ప్ర‌సాద్ (పీవీపీ ప్ర‌సాద్‌) పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఆయ‌న మాత్రం తాను ఓడిపోయినా..విజ‌య‌వాడ వాసుల‌కు అండ‌గా ఉంటాన‌ని చెప్పారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఐపు లేకుండా పోయారు. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ త‌ర‌ఫున ఎంపీ అభ్య‌ర్థిగా తెర‌మీదికి రాలేదు. ఇదిలావుంటే.. టీడీపీ త‌ర‌ఫున ఎవ‌రు నిల‌బ‌డ్డా.. వారి గెలుపున‌కు సాయం చేస్తాన‌ని.. ప్ర‌స్తుత ఎంపీ కేశినే ని శ్రీనివాస్ చెబుతున్నారు.

Balashowry Vallabhaneni Biography, Age, Height, Weight, Family, Caste, Wiki  & More

అయితే.. ఆయ‌న‌కే టికెట్ ఇస్తార‌ని.. పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. గ్రామీణ స్థాయిలో ప‌ట్టు పెంచుకున్న కేశినేని.. గెలుపు అనివార్యంగా మారింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ విధంగా ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇక జ‌గ‌న్ కూడా రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌తో పాటు కృష్ణా జిల్లాలో ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ సారి రెండు ఎంపీ సీట్లలో పార్టీ త‌ర‌పున బ‌ల‌మైన అభ్య‌ర్థులు లేక‌పోతే ఈ రెండు సీట్లు మ‌న‌కు క‌ష్ట‌మే అని ఆఫ్ ద రికార్డ్‌గా పార్టీ నేత‌ల‌తో అంటున్న‌ట్టు కూడా తెలుస్తోంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp