ఇప్పుడు ఇదే మాట ఏపీలో అధికార వైసిపి వర్గాలతో పాటు.. అధికార వర్గాలలో బాగా వినిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో పరిపాలన సాగుతున్న తీరుతో చాలామంది అధికార పార్టీ వాళ్ళే భయంతో వణికి పోతున్నారు. ఇక టిడిపి – జనసేన పొత్తు తర్వాత అధికార పార్టీలో చాలామందికి ఆశలు లేకుండా పోయినట్లు అయింది. ముఖ్యమంత్రి జగన్ కు తాను మళ్ళీ అధికారంలోకి వస్తానన్న ఆశలు క్రమేపి అడుగంటుతున్నాయా? అందుకే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా ? అన్న సందేహాలు కూడా అధికార పార్టీ వాళ్ళనుంచే వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, రామోజీరావును అరెస్టు చేయాలన్నది జగన్ పంతంగా తెలుస్తోంది. ఇప్పటికే ఏమాత్రం సరైన ఆధారాలు లేని కేసులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేశారు. ఇప్పుడు లోకేష్ పైన అదే ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇక రామోజీరావు పై చర్యల విషయంలో హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు అధికారులు కూడా గత్యంతరం లేక ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటున్న పరిస్థితి.
ఎన్నికలకు ముందు జగన్ ఎందుకు తమపై ఒత్తిడి తెస్తున్నారో సీనియర్ అధికారులు సైతం ఆలోచించలేని పరిస్థితి. అసలు ఆయనకు మళ్లీ గెలుస్తామన్న నమ్మకం లేదని కొందరు అంతర్గత చర్చల్లో మాట్లాడుకుంటున్నారన్న ప్రచారం కూడా బయటకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం ఉంటే అసలు ఇలాంటి పనులు చేసి ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యతిరేకత పెంచుకోరని… ఎన్నికల్లో గెలిచాకే ఇలాంటి పనులు చేస్తారు కదా ? అని కొందరు చర్చించుకుంటున్నారు.
మళ్లీ జగన్ రెడ్డి గెలిచే అవకాశం లేదని అధికార వర్గాలు కూడా ఓ అంచనాకు వచ్చాయంటున్నారు. అందుకే జగన్ ఇప్పుడే కావాలని తన మనస్సులో ఉన్న కోరికలు, రివేంజ్‌లు అన్నీ ఇలా తీర్చేసుకుంటున్నారన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.