సీ ఓట‌ర్ స‌ర్వే: ఓట‌మి భ‌యంతో జ‌గ‌న్ రెడ్డి విల‌విలా..!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ? ఉండ‌బోతున్నాయ‌న్న దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇక జ‌న‌సేన – టీడీపీ పొత్తు అయితే ఇప్ప‌టికే ఖ‌రారు అయ్యింది. ఇక తాజాగా సీ ఓట‌ర్ సర్వే రిజ‌ల్ట్ చూస్తే జ‌గ‌న్ రెడ్డి ఓట‌మి భ‌యంతో ఆందోళ‌న ప‌డుతున్న‌ట్టు క్లీయ‌ర్‌గా తెలుస్తోంది. ఐఏఎన్ ఎస్ కోసం సీ ఓటర్ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల్లో గెలుపుపై అభద్రతా భావంతో ఉన్నారని మెజారిటీ ప్రజలు తేల్చి చెప్పారు.

ఇక తాజాగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టయిన తర్వాత సీఓటర్.. IANS ఏజెన్సీ కోసం చేసిన స‌ర్వేలో కీల‌క విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. ఓవ‌రాల్‌గా 58 శాతం మంది జ‌గ‌న్‌ రెడ్డి ఆందోళన, అభద్రతా భావంతో ఉన్నారని, అందుకే చంద్రబాబును పోలీసు ఆపరేషన్ లో అరెస్టు చేయించారని చెప్పారు. పార్టీల‌కు అతీతంగా ఈ అభిప్రాయాలు వెల్ల‌డ‌వుతున్న‌ట్టు చెపుతున్నారు.

టీడీపీ సపోర్ట‌ర్లుగా ఉన్న వారిలో 86 శాతం మంది ముఖ్యమంత్రి జగన్ అభద్రత‌తోనే చంద్ర‌బాబును కావాల‌నే అరెస్టు చేయించార‌ని చెప్పార‌ట‌. ఇక‌ బీజేపీ మద్దతుదారులుగా గుర్తించిన వారిలో మూడింట రెండొంతుల మంది కూడా ఇదే మాట చెప్పారు. ఇక ఆశ్చ‌ర్య‌క‌రంగా వైసీపీ సపోర్ట‌ర్ల‌లో 36 శాతం మంది తమ నాయకుడు జగన్ అభద్రత‌తో ఉన్న‌ట్టు చెప్పారు.

సొంత పార్టీ కార్యకర్తలు కూడా 36 శాతం మంది జగన్ రెడ్డి ఓట‌మి భ‌యం విష‌యాన్ని చెప్ప‌డంతో వైసీపీ ప‌నైపోయింద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇక వైసీపీలోనే చాలా మంది ప్ర‌జాప్ర‌తినిధులు ఈ సారి త‌మ గెలుపు క‌ష్టం అని ఇంట‌ర్న‌ల్‌గా చ‌ర్చించుకుంటున్నారు.