జ‌న‌సేన – టీడీపీ పొత్తు వైసీపీ ఘోరంగా ఓడే 55 సీట్లు ఇవే…!

ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం – జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేయటం ఖరారు అయింది. పవన్ కళ్యాణ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేయడంతో ఇక ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లటమే మిగిలి ఉంది. ఈ రెండు పార్టీల పొత్తు నేపథ్యంలో అధికార వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక ప్రభావంతో పాటు జనసేన ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు జిల్లాలలో ఉన్న వైసిపి ప్రజాప్రతినిధులు అయితే తాము ఖచ్చితంగా ఓడిపోతున్నాం అన్న అంచనాకు వచ్చేసినట్టే కనిపిస్తోంది.

ఈ విషయంపై వారు తమ అంతర్గత చర్చలలో కూడా చర్చించుకుంటున్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు అందులోని విశాఖ జిల్లాలో ఈ పొత్తు ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన – టిడిపి దెబ్బతో వైసిపి చిత్తుచిత్తు అవుతుందని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే తాము గెలవడం అనేది కలలో మాట అని చెప్పుకుంటున్న పరిస్థితి.

ఇక కృష్ణ, గుంటూరు జిల్లాలలో ఇప్పటికే రాజధాని ప్రభావంతో వైసిపి ప్రతిష్ట మసకబారింది. దీనికి తోడు ఈ రెండు పార్టీల పొత్తు దెబ్బ‌తో వైసీపీ నేత‌ల్లో భ‌యం అయితే ఒక రేంజ్‌లో ఉంద‌నే చెప్పాలి. శ్రీకాకుళం నుంచి మొద‌లుకుని రెండు గోదావ‌రి జిల్లాలు, ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 55 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ పొత్తు ఎఫెక్ట్‌తో ఘోరంగా ఓడిపోనున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేసిన ప్ర‌భావంతో 1000 నుంచి 2,3 వేల ఓట్ల తేడాతో చాలా చోట్ల టీడీపీ ఓడిపోయింది.

అయితే ఈ సారి వాళ్లంద‌రూ భారీ మెజార్టీల‌తో ఘ‌న‌విజ‌యం సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఏదేమైనా జ‌న‌సేన – టీడీపీ పొత్తు అయితే వైసీపీలో ప్ర‌కంప‌న‌లు రేపుతోన్న మాట వాస్త‌వం.