బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ చేసిన కామెంట్స్ నెట్ వైరల్ గా మారాయి. రీసెంట్ గా వరుణ్ ధావన్ తో కలిసి ‘బావాల్’ చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. తెలుగులో చేస్తున్న ‘ దేవర ‘ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే జాన్వి కపూర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని మరోసారి నిరూపించుకుంది.
జాన్వి మాట్లాడుతూ కొరటాల శివ గారు ఎన్టీఆర్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని తెలియగానే ఈ ఆఫర్ నాకే రావాలి అని చాలా బలంగా అనుకున్నాను. అప్పటికే చాలామంది హీరోయిన్స్ ని కలుస్తున్నారు అని తెలిసి… చాలా టెన్షన్ పడ్డాను… కొన్ని మీడియా ఛానల్స్ లో సోషల్ మీడియాలో నా పేరు వైరల్ అవుతుంది. ఆ వార్త నిజం కావాలని ఎంతో కోరుకున్నాను.. ఇంకా దేవుడికి పూజలు కూడా చేశాను… ఆ దేవుడు నా మొర ఆలకించి ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడని ఉబ్బితబ్బయ్యింది.
దీనితో ఎన్టీఆర్ తో నటించాలన్న నా కోరిక నెరవేరింది. మా అమ్మ కోరిక కూడా నెరవేరినట్లే అనుకుంటున్నాను అంటూ మాట్లాడింది జాన్వీ కపూర్. దీనితో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో సినిమా కోసం ఎంత ఆశతో ఎదురుచూసిందో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదే కాకుండా కచ్చితంగా ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులో మంచి స్థానాన్ని అందుకుంటుంది అంటున్నారు తమ అభిమానులు. మొత్తానికి దేవుడికి తన బాధ అర్థమయ్యేలా చెప్పి ఆఫర్ కొట్టేసిందిగా జాన్వి ..!