ప‌వ‌న్ – బాల‌య్య పొలిటిక‌ల్ మ‌ల్టీస్టార‌ర్ హిట్ కొట్టాల్సిన టైం ఇది..!

వెండితెరపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – నందమూరి నటసింహం బాలకృష్ణ తమ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. వీరిద్దరిది వైవిధ్యమైన వ్యక్తిత్వం.. తమకోసం ఏదో సంపాదించుకోవాలి కోట్లు కూడా పెట్టాలి అన్న మనస్తత్వం ఎవరికీ లేదు. ఇద్దరిదీ కూడా సమాజం పట్ల సేవా దృక్పథం ఉన్న మ‌న‌స్త‌త్వ‌మే. పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తాను సంపాదించుకుంది ఏమీ లేదు. ప్రజలకు ఏదో చేయాలన్న తపనతోనే ఆయన ఉంటారు.

తన వంతుగా సాయం చేస్తూనే ఉంటారు. రేపు రాజకీయాల్లోకి వచ్చిన సంపాదించుకున్నది ఏమీ ఉండదనే చెప్పాలి. ఇక బాలకృష్ణ అటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మంది రోగులను బతికించే మహా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. బాలయ్య బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కోసం ఎంతలా ప్రాణం పెడతారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

ఇక బాలయ్య టాక్‌ షో అన్‌స్టాప‌బుల్‌కు పవన్ కళ్యాణ్ రావడం ఒక సంచలనం. రాజకీయంగా ఈ ఇద్దరు వేరువేరు పార్టీలలో కొనసాగుతున్నా ఈ ఇద్దరి దృక్పథాలు ఒకటే అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ – బాలయ్య కలిసి పని చేయటం దాదాపు ఖరారు అయినట్టే..!

ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మిలాఖ‌త్‌ అయ్యేందుకు బాలయ్య – పవన్ కళ్యాణ్ కలిశారు. రేపటి ఎన్నికలలో ఇద్దరు కూడా క్షేత్రస్థాయిలో కలిసి పని చేస్తే వీరు పొలిటికల్ మల్టీస్టారర్ వచ్చే ఎన్నికలపై బలమైన ప్రభావం చూపుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

బాల‌య్య – ప‌వ‌న్ పార్టీల‌తో సంబంధం లేకుండా క‌లిసి పోరాటం చేయాలి. ఆ పోరాటం ఖ‌చ్చితంగా ల‌క్ష‌లో సంఖ్య‌లో ఉన్న నంద‌మూరి, మెగా, ప‌వ‌ర్‌స్టార్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం, స్ఫూర్తి నింపుతుంది అన‌డంలో సందేహం లేదు.