పాపం త‌మ‌న్నా ఇంత క‌రివేపాకు … ఇంత లైట్ అయిపోయిందా…!

మిల్కీ బ్యూటీ తమన్న సౌత్ స్టార్ హీరోయిన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అవుతున్నా కూడా అమ్మడు అందాల ఆరబోత ఏమాత్రం తగ్గడం లేదు. తన కెరీర్ లో ఎంతోమంది సూపర్ స్టార్స్ తో ఈమె సినిమాలు చేసింది. తాజాగా ఈ బ్యూటీ చిరంజీవి, రజినీకాంత్ సినిమాల్లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

చిరుతో భోళా శంకర్, రజినీకాంత్ తో జైలర్ సినిమాల్లో న‌టిస్తుంది. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు న రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించే అవకాశం ఉంది. ఈ సినిమాలు హిట్ అయినట్లయితే తమన్నా నాలుగు ఐదు సంవత్సరాలు స్టార్ హీరోల సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఈ బ్యూటీ కొనసాగే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. జైలర్ చిత్రం విడుదల అవ్వకుండానే తమన్నా పాత్ర కూరలో కరివేపాకుల ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజాగా విడుదలైన జైలర్ సినిమా ట్రైలర్ లో తమన్నాకు సింగిల్ టేక్ కూడా ఇవ్వలేదు. వా నువ్వు కావాలయ్యా పాటతో సినిమాకు సూపర్ క్రేజ్ ను తెచ్చి పెట్టింది కానీ ట్రైలర్ లో మాత్రం చోటు సంపాదించలేదు. ట్రైలర్ లో తమన్నాను చూపించలేదు అంటే కచ్చితంగా కథలు తమన్నా పాత్రకు పెద్ద ప్రాముఖ్యత ఉండకపోవచ్చు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

పాపం తమన్నాకు ఈ సమయంలో ఆటలో బుడంకాయ్ వంటి పాత్ర కాకుండా లిడ్ రోల్స్ వస్తాయా అంటూ కొందరు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక భోళా శంకర్ లో మిల్కీ బ్యూటీ పరిస్థితి ఏమిటో తెలియాలంటే సినిమా రిలీజ్ అవ్వాలి. ఈ సినిమాలో కీర్తి సురేష్ కీ కీలక పాత్ర ఉందని మనందరికీ తెలిసిందే. భోళా శంకర్ సినిమాలో తమన్నా కి మంచి పాత్ర దక్కినట్లయితే ఒకటి రెండు సినిమాల్లో అయినా అవకాశాలు వస్తాయి.