ఆచార్య చాణక్యుడు… చాణక్య నీతిలో కొంతమంది భార్యలకు ఉండే దుర్గుణాలను ప్రస్తావించాడు. అలాంటి గుణాలు లేని అమ్మాయిని భార్యగా చేసుకోవాలని సూచించాడు. అలాంటి గుణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె దుర్గుణాలు అతనిపై చెడు ప్రభావాన్ని చూపుతాయని తెలిపాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆచార్య చాణిక్యుడు తన చాణక్య నీతిలో చాలా అంశాలను చెప్పాడు.
అందులో స్త్రీ పురుషుడు యొక్క యోగ్యతలు, లోపాలను కూడా తెలియజేశాడు. కొందరు స్త్రీలలో ఉండే ఇలాంటి చెడు దుర్గుణాలు… వారి పసుపు కుంకములకు ప్రాణాంతకం కావచ్చు అని తెలిపాడు. మంచి స్వభావం లేని స్త్రీలు తమ భర్తలకు శత్రువుల కంటే తక్కువేమీ కాదు అని చాణిక్యుడు చెప్పాడు. ఇలాంటి స్త్రీలు తమ భర్త జీవితాన్ని నరకం కంటే అధ్వానంగా మార్చేస్తారు అంటూ చెప్పాడు.
చెడు స్నేహాలు, చెడు పనులు చేసే స్త్రీలు, పురుషులను జీవితాన్ని నాశనం చేస్తారని చాణిక్యుడు చెప్పాడు. కొందరు స్త్రీలు అత్యాశ కలిగి ఉంటారు. ఇలాంటి భార్యలు ఎక్కడ డబ్బు అడుగుతూ భర్తలను అప్పుల పాలు చేస్తారట. ఇలాంటి భార్య చేసే పనులు భర్తకు చాలా నష్టం కలిగిస్తాయని చాణిక్యుడు తెలిపాడు.
ఏ పనైనా ముందుగా ఆలోచించకుండా చేసే స్త్రీలు, చేసే ముందు భర్తను అడగకుండా చేసే స్త్రీలు, భర్త మంచివాడు అయినప్పటికీ తన భర్త నుంచి మార్గదర్శకత్వం తీసుకోకపోవడం వంటి పనులు చేస్తారు. ఇలాంటి స్త్రీలు పురుషుల జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంది అని చాణిక్యుడు చెప్పాడు. ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీ పురుషుడి జీవితంలోకి వస్తే అతని జీవితాన్ని నాశనం చేయడాన్నే పనిగా పెట్టుకుంటారు. తన జీవితంలో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండవని చాణుక్యుడు తెలియజేశాడు.