ఆ ఎమ్మెల్యే ఫోన్‌పై వైసీపీ నిఘా పెట్టిందా… ఎందుకంత సీక్రెట్‌…!

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే, వైసీపీ రెబ‌ల్ నాయ‌కుడు కోటంరెడ్డి శ్రీధ‌ర్‌పై అధికార పార్టీ వైసీపీ నిఘా పెట్టిం దా? ఆయ‌న ఏం చేస్తున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? అనే కీల‌క అంశాల‌ను కూడా సేక‌రిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి త‌న ఫోన్ ను ట్రాప్ చేశార‌ని.. త‌ను ఎన్నోఏళ్లుగా పార్టీ కోసం ప‌నిచేస్తున్నాన‌ని.. త‌న‌ను విశ్వ‌సించ‌క‌పోవ‌డంతోనే త‌న ఫోన్‌ను ట్రాప్ చేశార‌ని ఆయ‌న ఆరోపించారు.

KotamReddy Sridhar Reddy: వారసత్వ రాజకీయాలతో ఎదగలేదు.. పోరాటాలు చేసి ఈ స్థాయికి చేరా..!! - NTV Telugu

ఈ క్ర‌మంలోనే ఆయ‌న రెబ‌ల్‌గా మారారు. ఇక‌, పార్టీ కూడా ఆయ‌న‌ను వ‌దిలించుకుంది. అయితే.. గ‌త కొన్నాళ్లుగా.. కోటం రెడ్డి చేస్తున్న వ్యాఖ్య‌లు.. ఆయ‌న వేస్తున్న అడుగుల‌ను వైసీపీ తీవ్రంగా సందేహిస్తోం ది. ఎందుకంటే.. త‌న వెనుక చాలా మంది ఉన్నార‌ని.. తాను పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చానంటే.. అంత తేలిక‌గా అంచ‌నా వేయొద్ద‌ని.. కోటంరెడ్డి వ్యాఖ్య‌లు చేశారు. దీనిని గ‌మ‌నించిన వైసీపీ.. ఏదో వ్యూహం ఉంద‌ని ముందుగానే గుర్తించింది.

Win in Nellore rural segment not a cakewalk for Kotamreddy

ఈ క్ర‌మంలోనే పార్టీ నుంచి ఎవ‌రైనా రెడ్డి నేత‌లు కోటంరెడ్డికి ట‌చ్‌లోకి వెళ్లారా? వెళ్తున్నారా? అనే విష యాల‌పై కూపీలాగుతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే చాలా మంది రెడ్డి నాయ‌కులు వైసీపీకి వ్య‌తిరేకంగా ఉన్నార‌ని.. వారంతా కూడా కోటంరెడ్డి వెంట న‌డిచేందుకు అవ‌కాశం ఉంద‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. అటు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. ఇటు నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. కూడా ప్ర‌తిరోజూ ఏదో ఒక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు.

ఆయా కార్య‌క్ర‌మాల‌కు కోటంరెడ్డివ‌స్తున్నారు. మ‌రి ఈ కార్య‌క్ర‌మాలు ఎందుకు చేస్తున్నారు? అన్న‌దానా లేంటి.. ప్రారంభోత్స‌వాలేంటి? అనే విష‌యాల‌పై వైసీపీ కీల‌క స‌ల‌హాదారు తాజాగా స‌మాచారం తెప్పిం చుకున్న‌ట్టు స‌మాచారం. వ్యూహాత్మ‌కంగానే కోటంరెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఎన్నిక‌ల నాటికి ఉన్న ప‌రిస్థితిని బ‌ట్టి రెడ్డి వ‌ర్గం ఆయ‌న‌తో అడుగులు వేస్తుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.

Tags: ap politics, intresting news, latest news, latest viral news, social media, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp