చిరు త‌ల్లిదండ్రుల‌ది ఇంట‌ర్ క్యాస్ట్ మ్యారేజా… ఇన్నాళ్ల‌కు ప‌వ‌న్‌తో బ‌య‌ట‌ప‌డ్డ నిజం…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలతో పాటు అటు రాజకీయాల్లోనూ ఫుల్ బిజీగా దూసుకుపోతున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటేందుకు జనసేన ప్రణాళికలు మామూలుగా లేవు. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటిల్లో ఎన్ని పూర్తవుతాయో ? లేదో తెలియదు.. కానీ వచ్చే ఆగస్టు.. సెప్టెంబర్ నుంచి పవన్ పూర్తిగా ప్రజల మధ్యనే ఉండేలా రెడీ అవుతున్నారు.

పవన్ సినిమాలో ఉన్నప్పుడు విమర్శలు తక్కువ. ఎప్పుడు అయితే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి జనసేన పార్టీ స్థాపించాడో అప్పటినుంచి పవన్ ను టార్గెట్ చేసేవాళ్లు రోజుకు పెరిగిపోతున్నారు. విచిత్రం ఏంటంటే ఒకప్పుడు పవన్ కు వీరాభిమానులు కూడా ఇప్పుడు ఇతర పార్టీల్లో ఉండి పవన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ వ్యక్తిగత జీవితంపై కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

తాజాగా పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో పవన్ తన తల్లి.. తండ్రి కులాలు వాటి తెగల గురించి కూడా చెప్పటం విశేషం. పవన్ తనకు కులాల గురించి పట్టింపు ఉండదని ముందు నుంచి చెబుతూ వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన తల్లి బలిజ అని.. తండ్రి కాపు అని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కులం ఏంటన్న ? ప్రశ్న వస్తే కాపు అనే ఎక్కువమంది భావించేవారు.

Chiranjeevi Pawan Kalyan Rift | Nagababu Son Varun Tej | Srikanth Addala  Film Launch - Filmibeat

అయితే పవన్ తల్లి బలిజ అన్న విషయం ఇప్పటివరకు పవన్ చెపితే కానీ తెలియదు. ఇక బలిజ కులం కూడా కాపు కులంలోని ఉప కులం. కోస్తా.. గుంటూరు.. కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గం అని పిలుస్తూ ఉంటారు. అదే రాయ‌ల‌సీమ‌లో వీరిని బ‌లిజ‌లు అని పిలుస్తూ ఉంటారు. సీమ‌లో వీరి సంఖ్య బాగా ఎక్కువ‌. ఏదేమైనా ప‌వ‌న్ రాజ‌కీయంగా ఎద‌గాల‌ని కాపు, ఉప కులాల వారు ఆకాంక్షిస్తున్నారు.

Tags: chiranjeevi, film news, filmy updates, intresting news, latest news, latest viral news, Mega Family, Pawan kalyan, social media, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news